చెలించని ఆత్మవిశ్వాసం

చెలించని ఆత్మవిశ్వాసం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సుజాత కోకిల

మనసుకు మానని గాయాలు ఎన్నో
ఎదురీతకు ఎదురు నిలబడి పోరాడినా
చెలించని మానవ మృగాలు
ఎన్నో ఘోరాలు కడుపులోనే
సమాధి చేసుకున్న చెేదు జ్ఞాపకాలను వెంటాడి వేటాడుతున్నజీవితం
వెనుక నుండి వెన్నుపోటు పొడుస్తున్న
సుడిలా మనసును ముక్కలు చేస్తూ
పిండుతున్న ఓపికను తెచ్చుకుంటూ
కర్కశంగా మారుతున్న మృత్యువు ఒడిలో
చేరాలనే కోరిక ఉన్నా ఏమీ చేయలేక
దిక్కులు చూస్తూ మూగజీవిలా
అయోమయంలో ఉన్న
ఊసరవెల్లిలా మారుతూ నక్కజిత్తుల
వేషాలు వేస్తూ మానవత్వాన్ని కోల్పోయి
తేనె పూసిన కత్తిలా వేటాడుతూ
క్రూర మృగాల కంటే హీనంగా మారి
వారి చేతిలో బలిపశువునై పోతున్న
చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం నాలొ ఉంది
అలాగే ముందుకు వెళుతూ
ఏదో చెయ్యాలనే ఆత్మవిశ్వాసం నాలో ఉంది ఇంకా ఘోరాలను
పాపలను చూస్తూ భరిస్తూ ఉండలేను

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!