ఓ అందాల భామ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: సుజాత.కోకిల
ఓ భామ నీ అందాలతో నన్ను కవ్వించకెే
నీ అందాలన్నీ కలబోసి నాట్యమయూరిలా
నా ఎదుట నిలిచి నీ అందమైన నయనాలతో
నాట్యం ఆడుతుంటే పవిట చెంగు జారీ
నన్ను కవ్విస్తుంటే స.రి.గ.మ ప.ద.ని.లా
గుండె వేగాన్ని పెంచుతూ విరహ గీతాలు
పాడుతుంటే నాలో ఏదో తెలియని
కొత్త వింత మొదలాయే తలుక్కుమనే
నీ కలువ రేకుల్లాంటి నీ కాటుక కనులలో
ఏదో ఒక మెరుపు మెరిసింది నాకే తెలియని
వింత మాయా నన్ను కమ్మేసింది
ఏంటి అంటూ గుసగుసగా మత్తుగా
నా మనసును ప్రశ్నించెేలా చేశావు
నీ అందంతో నన్ను నేను మర్చేలా చేశావు
ఏదో కొంటే వయసు నాలో కొత్త విత్తనం
మొలకెత్తేలా చేశావు నాలో ఏదో తెలియని
బిడియం నాలో మొదలైంది నా తడబాటుతో
అడుగులు వెనక్కి పడ్డాయి నేను నిన్ను
చూడగానే నీ బుగ్గలు ఎరుపెక్కాయి
నీ పెదవులు అదురుతున్నాయి నాలో భయం
ఏదో మూల నీ మౌనం పెదవులుదాటి రానంటుంది
నా సంతోషం నీతో పంచుకోవాలని
నా మనసు గాలిలో తేలి ఆడుతూ
నీ చెంతకు చేరాలని నా మనసును నీతో
పంచుకోవాలని నీ ఒడిలో వాలాలని ఉంది.