జీవదాతవై వర్ధిల్లు

జీవదాతవై వర్ధిల్లు..!

రచన:: పిల్లి.హజరత్తయ్య

అన్నదానం ఆకలి తీర్చు
విద్య దానం జ్ఞానం పెంచు
రక్తదానం ప్రాణం నిచ్చు
దానాలన్నిటిలో రక్తదానమే
మిన్నయని గ్రహించు.

మరణశయ్యపై పరుండిన
మనుషులకు మానవత్వమనే
రక్తంతో తర్పణం గావించి
ప్రాణమనే ఆయుష్షును పోసే
దైవ స్వరూపడే రక్తదాత.

జీవం పోసేది విధాత
పునర్జన్మ నొసిగేది రక్తదాత
రక్తదాతే ప్రాణదాత
ఆయనే స్ఫూర్తిప్రదాత.

రక్తదానం పుణ్యకార్యం
వ్యాధిగ్రస్తులకు వరం
కులం మతం వర్గం వర్ణం
తేడాలను మరచి అందరం
సృష్టికార్యంలో భాగమవుదాం..!

రక్తదానంపై అపోహలు వీడి
మూడు నెలలకు ఒకసారైనా
రక్తమును దానం చేసి
ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకుందాం
తోటివారికి ప్రాణభిక్ష పెడదాం..!

ఆరిపోయే దీపానికి
రక్తమనే నూనెతో జీవమొసంగి
జగతిని కలకాలం
జీవదాతవై వర్ధిల్లు..
జనుల హృదయ వేదికన
చిరంజీవివై భాసిల్లు..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!