వ్యూహాలతో సాగిలి ముందుకు…!
రచన: పిల్లి.హజరత్తయ్య
భరతమాత తన బిడ్డలకు
తరగని సంపదలను
సహజవనరులను ఇచ్చి
బాదిబంద్రీలు లేని బతుకుతో
పున్నమి వెన్నెల్లా వికసించమన్నది..!
మేలైన అలవాట్లను విడిచి
ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంతో
సంపదంతా కొవ్వొత్తిలా కరగడమేకాక
విపరీతంగా పెరిగిన జనసంపత్తితో
మొదటికే మోసం వచ్చింది..!
పెరిగిన జన సంపద
భరతమాత కుటుంబంలో
అలజడులను రేపింది..!
కళకళలాడిన తల్లి దేహం
సమస్యల వలయంలో చిక్కుకుని
మసకబారి పోయింది..!
ఒడలిపోయిన భారతావనికి
వెలుగులు దిద్దడానికి
జనవలయాన్ని ఛేదించే
వ్యూహలతో సాగాలి ముందుకు..!
***