ఎందుకు ఈ అలజడి

ఎందుకు ఈ అలజడి

ఏమని చెప్పాలి, ఎలా తెలపాలి

నా మది లోతుల్లో దాచిన ప్రేమను

కవిత రూపంలో తెలుపనా, కానీ నేను కవిని కానే…

పాట రూపంలో తెలుపనా, కోకిలను కానే..

పోనీ నాలోని ఆశలు అన్ని ఊసులు గా మలిచి నీకు చెబుదాం అంటే…

నీవు ఎదురుపడగానే నా హృదయ స్పందన లయ తప్పి

చేసే నాట్యానికి ఊపిరి ఆగిపోతుంది ఏమో అని భయం….

కానీ ఒక మాట చెప్పనా బంధమా..💖

నీ ఆకలి తీర్చేఅమ్మను అవుతా..

లాలించే నాన్నను అవుతా…

ఆప్యాయతలు పంచే అక్కను అవుతా…

ఆదరించే అన్నని అవుతా…

అల్లరి చేసే స్నేహాన్ని అవుతా…

నిశిరాత్రిలో వెలుగులు తెచ్చే వెన్నెలను అవుతా..

నీ జీవితంలో వసంతాలు తెచ్చే ఆమనిని అవుతా…

కష్ట సుఖాల్లో తోడుగా నా తుది శ్వాస వరకు నీ భార్యగా  నీలో సగమవుతా

నీవు నాకు ఊపిరిపోసే ప్రేమవు అవుతావా ప్రాణబంధమా…         

మది నిండిన నీ జ్ఞాపకాల బరువును మోయలేక…

కళ్లలో పొంగుతున్న కన్నీటి సంద్రాన్ని ఆపలేక…

నాతో నేను ఉండలేక, నీతో వుండే వీలు లేక…

నీ కనుపాపలో నా రూపు జాడ లేక…

నా నిన్ను ఒక్కసారి అయిన చూడాలన్న ఆశ తీరక…

నీతో పంచుకోవాలి అన్న ఊసుల  గుసగుసలు వినలేక…

అవనిజకు భారమై ఉండలేక ఆ నింగిన జాబిల్లిని చేరలేక…

నీవు సృష్టించిన ప్రేమ అలజడి ని తట్టుకోలేక…

మరల  మనస్సును శిలను చెయ్యలేక……

ఈ క్షణం ఇలా ఊపిరిని ఆపలేక

సతమతమవుతున్న ప్రాణబంధమా…….

రచన – లంకా జయ కుమారి

You May Also Like

One thought on “ఎందుకు ఈ అలజడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!