మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం 
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచయిత :: భరద్వాజరావినూతల

ప్రకృతి మనిషికి చ్చిన వరం మొక్కలు
బ్రతుకంతా కనిపిస్థాయి దానినీడలు –
బ్రతుక్కు తోడ్పడే దైవాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు

పర్యావరణ రక్షణకు సహకరించు –
భూమికి సూర్యతాపాన్ని తగ్గించు –
వర్షానికి ఆధారభూతమౌనిలుచు
చూడచక్కని తెలుగు సున్నితంబు.

అశోకుడు నాటిన మొక్కలు స్ఫూర్తి –
ప్రతిరోజు మొక్కనాటి పొందు తృప్తి –
మరవకు అవిమన జీవం అన్నసూక్తి –
చూడచక్కని తెలుగు సున్నితంబు.

నేటి మొక్కలు రేపటి వృక్షాలు –
ఆవి మనల్ని రక్షించే శ్రామికులు –
అన్నంపెట్టే అన్నదాతలు
చూడచక్కని తెలుగు సున్నితంబు.—!

పచ్చనిచెట్టు ప్రగతికి మెట్టు –
వాటిని నరికితే భవిష్యత్తు ఆటకట్టు –
మొక్కలునాటే ఉద్యమాన్ని చేపట్టు
చూడచక్కని తెలుగు సున్నితంబు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!