చివరిక్షణం

కన్నుల్లోని ఆశల రూపం

కరిగి పోయే క్షణం..

ఊపిరి నిండిన దేహం

బిగుసుకుపోయే క్షణం ..

అందంకై ఆరాటపడే దేహం కాసేపటిలో జీవం కోల్పోయే క్షణం…

నిర్జీవమగు మేను పాడయ్యే సమయం దగ్గరయ్యే క్షణం..

సాధించినది ఉన్నా లేకున్నా చిన్న నవ్వుతోనే లోకం వదలాలి అనే ఆశే జీవితాన మెండుగా కలిగిన క్షణం..

చేసిన తప్పొప్పుల ఖాతా ముగింపు నేడే అని తెలిపే క్షణం….

బాధ్యతల నుండి విముక్తికి ఆఖరి నిమిషం దరి చేరెను అనే క్షణం….

కావలసిన బంధాలన్ని దగ్గర చేరి పరామర్శించే క్షణం..

అనుకోకుండా పలకరించే అతిధికి

తెలియకనే స్వాగతం పలికే క్షణం..

జీవమున్న ప్రతి జీవి జీవన గమనంలో

తెలిసో తెలియకనో పలకరించే క్షణం ..

జీవితం యొక్క చివరిక్షణం..

విజయ

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!