ఎదురు చూపు
అనుక్షణం నీకోసం ఆరాటపడే
నా మనసుకి సమాధానం
నువ్వు చెప్పక్కరలేదు
కారణం నీ మనసులో నాకంటూ
ఏ స్తానం లేదు ఎపుడో పలకరింపు తప్ప
వద్దన్నా వినకుండా ప్రతి క్షణం
నిన్నే తలచుకుంటూ అలజడి పడి
నా నుంచి నన్నే దూరం చేస్తూ
కన్నీళ్ళని కానుకగా మిగులుస్తూ
ఎందుకు ఎదురుచూస్తుందో
ఎందుకు నిన్నే ప్రాణంగా ప్రేమిస్తుందో
అర్థంకాని నా ఆలోచనకి
సమాధానం ఎపుడు చెప్తుందో
ఎల్లప్పుడూ నిన్నే తలచుకునే నా మనసు
నీ నుంచి దూరం చేయాలి అనుకుంటుంటే
నా నుంచి నన్నే లేకుండా చేస్తుంది
అన్ని మరిచిపోయి నీకోసమే ఆలోచిస్తుంది
ఒక్క సారి నీ పిలుపుకోసం ఎదురుచూస్తుంది
రచన:సంధ్య