🌹దేవుళ్ళ సృష్టి 🌹
– కార్తీక్. దుబ్బాక
ప్రకృతిని అర్ధం చేసుకోలేని
ఆదిమ మానవుడు..
ప్రకృతి నామాల సృష్టి
ఆధునిక మానవుడు…
బ్రతుకుపోరు బాటలో
కందమూలాలుకోసం
అడవుల్లో సంచార జీవి
నాటి మానవుడు…
కార్చిచ్చుల్లోఅడవులుకాలుతుంటే
అఛేతనంగభయంతోచేతులుజోడిస్తేఅగ్నిదేవుడన్నాడు
నేటి మానవుడు…
నీటి వనరుల ప్రక్కననివాసాలు
ఎక్కడోకురిసినవానకువరదల్లో చిక్కి
భయంతో అఛేతనంగా చేతులు
జోడిస్తే,వరుణ దేవుడన్నాడు
నేటి మానవుడు…..
ప్రఛండగాలులు వీచినప్పుడు
భయంతో చేతులు పైకి ఎత్తితె
వాయు దేవుడన్నాడు
నేటి మానవుడు…
భూకంపాలు వచ్చినప్పుడు
భీతితో అఛేతనంగా చేతులు
పైకిలేస్తేభూదేవతన్నాడుపూజింపమన్నాడు
నేటిమానవుడు….
చీకటి, వెలుగులమార్పులు
తెలియని నాటి మానవుడు
వెలుగు కై చేతులుజోడిస్తే
సూర్య దేవుడన్నాడు
నేటి మానవుడు…..
నేటి మానవుడు పెట్టిన ప్రకృతి
నామాలే దేవుళ్ళు….
శుఖ జీవుల సృష్టి, శ్రమ జీవుల
దోపిడీకి “పునాది రాళ్ళే “……
ఈ “దేవుళ్ల సృష్టి”…..
***