మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం 
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచన :: కాలై కవితసుభాష్

ప్రకృతి మనకు ప్రాణాధారము
తరువు తరిగితే హానికరము
తల్లిలా తీర్చకోలేని ఋణము
చూడచక్కని తెలుగు సున్నితంబు

ఇంటింటా మొక్కలు నాటుదాం
ఇలను కోవెల చేద్దాం
పచ్చని తోరణం కడదాం
చూడచక్కని తెలుగు సున్నితంబు

తరువును తల్లిగా భావించు
ప్రకృతిలో భాగమై జీవించు
నిన్ను నీలా ప్రేమించు
చూడచక్కని తెలుగు సున్నితంబు

మొక్క మానుగా మారును
నేడు నాడై తీరును
త్యాగ జ్యోతిగా వెలుగును
చూడచక్కని తెలుగు సున్నితంబు

ఆరోగ్యానికి ఔషధంగా మారును
ప్రాణవాయువై గూడు నిలుపును
ఆహరమై దేహదారుఢ్యాన్ని ఇచ్చును
చూడచక్కని తెలుగు సున్నితంబు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!