మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం 
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచన :: పత్తెం విజయ రాఖి

మనమందరం మొక్కలు నాటేద్దాం
భావితరాలకు పచ్చని బాటలువేద్దాం
ప్రాణవాయువును అందరికీ అందిద్దాం
చూడచక్కని తెలుగు సున్నితంబు

పచ్చనిప్రకృతి జనజీవన ప్రగతి
సహజవనరులే మానవ పురోగతి
కారాదు మనజీవనం వికృతి
చూడచక్కని తెలుగు సున్నితంబు

పచ్చనిపైరుల సుందర ఆకృతి
నవవధువు హొయల కళాకృతి
మానవ మనుగడకదే రక్షతి
చూడచక్కని తెలుగు సున్నితంబు

అతిక్రమించకు ప్రకృతి నియమాలు
వృక్షాలే మన వనదేవతలు
ఇచ్చును ఆరోగ్య ప్రసాదాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు

తరువులు మనకు గురువులు
తనువును అర్పించే త్యాగధనులు
అన్నార్థుల పాలిట అన్నపూర్ణలు
చూడచక్కని తెలుగు సున్నితంబు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!