మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం 
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచన :: S. రత్నలక్ష్మి

నాటుదాం ఈనాడే మొక్కలు
అవుతాయి భవితకు ఆధరువులు
ప్రజలకు అందించగా ప్రాణవాయువులు
చూడచక్కని తెలుగు సున్నితంబు

పశువుల బారిన పడకుండా
ఎండలకు వడలి వాడకుండా
జాగ్రత్తలు పాటిద్దాం తప్పకుండా
చూడచక్కని తెలుగు సున్నితంబు

ప్రతిరోజూ నీటిని అందిద్దాం
సహజ ఎరువులతో పెంచేద్దాం
తగిన సంరక్షణ కల్పిద్దాం
చూడచక్కని తెలుగు సున్నితంబు

మొక్కలు ఔషధాలనందించే వనరులు
సకలం ప్రసాదించు కల్పతరువులు
ప్రకృతికి మూలాధారం భూరుహాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు

భూతాపాన్ని తగ్గించు భూరుహాలు
వర్షాలను కురిపించు వృక్షరాజాలు
ప్రకృతి సమతుల్యతకు ఆయువుపట్లు
చూడచక్కని తెలుగు సున్నితంబు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!