మొక్కలు నాటు సంరక్షించు

ప్రక్రియ :: సున్నితం 
అంశం:: మొక్కలు నాటు సంరక్షించు

రచన :: కుందారపు గురుమూర్తి

మొక్కలను మనిషిగా రక్షించు
తరువులు జనులను రక్షించు
కానిచో ప్రకృతే శిక్షంచు
చూడచక్కని తెలుగు సున్నితంబు

జగతిని హరితము చేయుటకు
జనుల ప్రాణము కాయుటకు
తరువుల పెంచుటకు తపనపడు
చూడచక్కని తెలుగు సున్నితంబు

క్షితిజము క్షోణిలో దైవము
త్యాగగుణము దాని లక్షణము
త్రుంచకు మెప్పుడు పెంచుము
చూడచక్కని తెలుగు సున్నితంబు

ప్రాణము నొసగెడి తరువులు
జగతిలో మనకవి గురువులు
ఎరిగి మసలవలె నరులు
చూడచక్కని తెలుగు సున్నితంబు

పాదపము పవిత్ర దైవతము
పంచును హాయిని నీడతో
నింపును పొట్టను పండ్లతో
చూడచక్కని తెలుగు సున్నితంబు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!