పరమేశ్వరుని ప్రతిరూపం

పరమేశ్వరుని ప్రతిరూపం

రచన: అయ్యలసోమయాజుల ప్రసాద్

బాల్యంలో మాకు నాన్న చండశాసనుడు.
అమ్మ మేము అల్లరిచేసినపుడు నాన్నతో చెపుతాను అంటే వద్దమ్మా చెప్పకు అనడం ఇప్పటికీ గుర్తు.
జ్ఞానం వచ్చిన తరువాత తెలిసింది తాను తినిన,తినకపోయిన అహర్నిశలు మా ఉన్నతికై కష్టపడ్డారని…..!!

నన్ను గుడికి తీసుకెళ్ళి తన భుజాలపై ఎక్కించుకొని ఆలయ గర్భంలో దేముని చూపించినపుడు తెలియలేదు నేనే దేముని భుజస్కంధాలపై ఉన్నానని
మాకు, అమ్మకు పండగకి క్రొత్తబట్టలుకొని, తాను చినిగిన పాత బట్టలతోనే సరిపెట్టుకున్నప్పుడు అనుకున్నాను పిసినారి వాడని
నేను బిడ్డలకి తండ్రిగా మారిన తరుణాన తెలిసింది నిజంగా త్యాగానికి నిదర్శనం నాన్నని….!!

నైతికప్రవర్తన కలిగిన వ్యక్తులుగా సమాజంలో మారడానికి, మా అభివృద్ధికై, శ్రామికుడిగా, రక్షకుడిగా,విశ్రాంతి లేని జీవితాన్నిగడిపాడని,
మమ్మల్ని దెబ్బలాడిన ,నీతులు చెప్పిన విషయం
తండ్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ సమయాన అవగతమైంది..!!

నాన్న కంటిలో నీరు నేనెప్పుడూ చూడలేదు
ఎనిమిది పదులవయస్సులో అమ్మ భగవంతుని దరి చేరిన సమయాన
ఇద్దరి పిల్లలకి తండ్రినైన నాచేతిని తీసుకుని నీ బాధ్యత నాదిరా చిన్నా అని నాన్న అన్న క్షణాన
ఆర్ద్రత నిండిన హృదయంతో అనుకున్నా
సాక్షాత్తు పరమేశ్వరుని ప్రతిరూపమే పితృదేవులని…!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!