ఇదేనా నా దేశం..ఇదేనా నా దేశం

ఇదేనా నా దేశం..ఇదేనా నా దేశం

రచయిత :: బాలాజీ చెన్నూరి

ఇదేనా నా దేశం గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం

గ్రామాలను సైతం వదలని మహమ్మారి
ఒక చేతిలో మాత్ర మరో చేతిలో పార బట్టి ఎక్కడికీ నీ యాత్ర
లేకుంటే పూట గడవక పట్టాలి కాశీ యాత్ర

ఇదేనా నా దేశం నెహ్రూజీ నిర్మిచిన నవ భారత దేశం

చేతిలో డబ్బులేదు చెయ్యిపట్టి జబ్బు ఉందని చెప్పే దిక్కులేదు

చేతిలో బ్రెడ్ లేదు పడుకోవడానికి బెడ్ లేదు

ఆస్పత్రికెళ్తే ఆక్సిజన్ లేకపాయే
ప్రాణాలు మాత్రం గాలిలోన కలసి పాయే

ఇదేనా నా దేశం కలాంజీ
కలలు కనమన్న నాదేశం

కనులు మూసినా ఆరని చితులు కనులు తెరచినా అంతులేని వ్యథలు

ఇదేనా నా దేశం…ఇదేనా నా దేశం!!!

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!