భావనలు

భావనలు

రచయిత ::శివానంద వింజమూరి

కొన్ని సంగతులు మనసుకు ఎంతో మధురానుభూతిని కలిగిస్తూ….
చెప్పలేనంత సంతోషాన్ని కుమ్మరిస్తాయి …….
ఈ క్షణం పదాలలో దాన్ని వ్యక్తం చేయ లేకున్నా….
అది ఒక తుళ్ళింత, మత్తు, మైమరపు, కవ్వింత, ఆహ్లాదం,
ఉత్సాహం, ఒళ్లంతా ఏదో తెలియని విద్యుత్ ప్రవాహం….
అదొక విహారం…. మంచు కొండల నుండి జారే
స్వచ్ఛమైన జలం లా ఉంటుందా పయనం….
మబ్బుల పైనుండి విహంగాల వరుసలను తిలకిస్తున్నట్లుంటుంది…..
తనని తలచినప్పుడు హృదయంలో ఏర్పడే స్పందనలు….
తన రూపం కళ్ళముందు ప్రత్యక్షమైనప్పుడు కలిగే గిలిగింతలు…
తన పలుకుల శబ్దాలలో నే పొందే పులకింతలు….
క్షణక్షణం ఏం చేస్తుందో అనే ఊహలు….
తను నడిచే ఆ పరిసరాల్లో ఒదిగి పోవాలనట్లు ఆశలు…
తన పెరటిలో పూల చెట్టునై రోజూ ఒక పుష్పానై తన శిగలో చేరాలని….
తన తడిసిన కురులను తాకే సాంబ్రాణి గా మారాలని….
ఇలా తనని అన్నింటా ఊహించుకుంటూ ఎక్కడెక్కడికో
తెలీని తీరాలకు తరలి పోతుంటే…..
ఈ అనుభూతి అనుభవించే నా మనసెంతో
ఎక్కువ చేసుకుందనిపిస్తుంది…..ఈ జన్మ కు..
.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!