బడుగుల చేరవే వరలక్ష్మీ!(ఇష్టపది మాలిక)

బడుగుల చేరవే వరలక్ష్మీ!(ఇష్టపది మాలిక)

రచన:: డాక్టర్ అడిగొప్పుల సదయ్య

ఏడుకొండలవాని ఎదలోన కొలువుండి
ఎల్లలోకములనల చల్లగా చూడవే

తండ్రి దండన నుండి తప్పించి మముగాచి
పురుషకారముచేసి వరములిప్పించవే

జగమంత నీకొరకు జపములను,తపములను
కొలిచి తమ కోర్కెలతొ నిలిచి ఉన్నారమ్మ!

కడలిపై వానల్లె కలవారి భవనముల
స్థిరమయ్యి పేదిండ్ల చేరవెందుకు తల్లి?

బిర్లాల,టాటాల బిలములో నెలవుగొని
బడుగు కడుపుల నింప అడుగేయి మాతల్లి!

ఆదాని,అంబాని ఆవాసముల వదలి
పూరి గుడిసెల జొచ్చి పులకింపజేయవే!

మదన జననీ! నీవు కదలాడు ఇల్లేమో
సిరి సంపదల తూగి చిరునగవులొలికేను

ఇందిరా! నువు లేని ఇల్లు “నిల్లే”గాని
“ఫుల్లుగా” కష్టాల నీళ్ళగుండము తల్లి!

కనకలక్ష్మీ! నిన్ను కలవాడు “కలవాడు”
బలములన్నిటవాడు పరపతులు కలవాడు

పొదుపు చేయనివారి పొలిమేర పోబోకు
పిసినారి పేటికన వసియించకే తల్లి!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!