అమ్మ – నాన్న

అమ్మ – నాన్న

రచన: శిరీష వూటూరి

ఆకాశమంత ప్రేమ అమ్మ
కొండంత ధైర్యం నాన్న

ముందుండి నడిపించేది అమ్మ
వెన్నుతట్టి ప్రోత్సహించేది నాన్న

ఆప్యాయత పంచుతుంది అమ్మ
క్రమశిక్షణ నేర్పిస్తాడు నాన్న

గోరుముద్దలు తినిపిస్తుంది అమ్మ
గుండెలమీద ఆడిస్తాడు నాన్న

కోరింది చేసిపెట్టేది అమ్మ
కావాల్సింది సమకుర్చేది నాన్న

ప్రతి పనిలోనూ కనపడే ప్రేమ అమ్మ
ప్రేమనుకూడా సరిగావ్యక్తపరచలేడునాన్న

కుడి కన్ను అమ్మ
ఎడమ కన్ను నాన్న

దైవత్వాన్ని నమ్ముతుంది అమ్మ
మానవత్వాన్ని పెంపొందిస్తాడు నాన్న

ఆదిపరాశక్తి అమ్మ
ప్రణవనాదం నాన్న

అన్ని పిల్లలకోసం దాచి పెడుతుంది అమ్మ
తనకంటూ ఏది దాచుకొలేడు నాన్న

సంస్కారం నేర్పుతుంది అమ్మ
సమాజంలోఎలాబ్రతకాలోనేర్పుతాడు
నాన్న

ప్రేమలో కోపం చూపిస్తుంది అమ్మ
కోపంలో ప్రేమ చూపిస్తాడు నాన్న

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!