మధ్య తరగతి మనిషి

మధ్య తరగతి మనిషి

రచన: ఐశ్వర్య రెడ్డి గంట

మానవతా విలువలు నమ్మిన మనిషి
ఓ మధ్యమ మనిషి
విలువలను విడవ లేని మనిషి
కట్టుబాట్ల కౌగిటిలో ఉన్న మనిషి
కష్టాల కడలిలో సాగే నీ జతి

అవతల ఏమో ఆశల తీరం
ఇవతల ఏమో అప్పుల భారం
తెల్లవారితే భయం భయం
బతుకు పోరుకై రణం రణం

అత్తేసరు సంపాదనతో
అరకొర సాగే బతుకు బండి

సమస్యల సుడిగుండం చుట్టూ ఉన్న
నీ ఆశల అల ఊతమిస్తూన్న
నల్లేరుపై నడకలా సాగుతున్న జీవితాన
నలిగి పోక పట్టు విడవక సాగిపో

ఆకాశాన్ని అందుకోవాలనే కెరటమై
అడుగు అడుగున పైకి లే
రక్తాన్ని స్వేదం చేసి
అవకాశాన్ని అందిపుచ్చుకో

విశ్వాసంతో ముందడుగు వేసి
శ్రమ యే ఆయుధంగా
పూలబాట పరుచుకుని
చేరుకో ఆవలి తీరాన్ని ఆశల సౌధాన్ని.

***

You May Also Like

2 thoughts on “మధ్య తరగతి మనిషి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!