స్వార్థం – మనిషి
రచన: దొడ్డపనేని శ్రీ విద్య
స్వార్థం స్వార్థం స్వార్థం అంతటా స్వార్థం
అన్నిటా స్వార్థం
స్వార్థం ఒక పెనుభూతం
ఎన్నో కష్టాలకు , దు:ఖాలకు మూలం
నేను బాగుండాలి అన్నది సహజం….
నేనే బాగుండాలి అన్నది స్వార్థం…
జీవితంలో ఎదగటానికి స్వార్థం ఉండాలి…
ఎదుట వారిని ముంచటానికి కాదు సుమీ…
ఆకాశం నుంచి ఎగిసి పడే వర్షపు చుక్కకు లేదు స్వార్థం…
పండే పంటకు లేదు స్వార్ధం
మరి …
ఓ మనిషీ మూన్నాళ్ళ ముచ్చట కోసం ఎందుకు నీకీ స్వార్ధం
స్వార్థం తో నిన్ను పొగిడే వాడిని దరి చేరనీకు
స్వార్ధం మరీ ఎక్కువయితే అదే నీ జీవితంతో ఆడుకుంటుంది సుమీ
స్వార్థం మనిషి సహజ గుణం
అది సమాజ హేతువుగా ఉండాలే కానీ
నీ స్వనాశనం కి కారణం కాకూడదు
స్వార్ధం కన్నా విలువయినది మానవత్వం , త్యాగం
అవి అలవర్చుకో అప్పుడు నిన్ను మించిన *మనీషి* ఉండడు ఈ లోకంలో…
కెరటాలు కాళ్ళ దగ్గరికి వచ్చాయిని గర్వపడకు..
ఎదుటి వారు తగ్గారు కదాని వారి మంచితనాన్ని తక్కువ చేయకు…
స్వార్థం తో వేసే ప్రతి అడుగుకి సమాధానం చెప్పవలసి వస్తుంది…
జాగ్రత్త సుమీ !
***