పాక శాస్త్రం జీవన కళ

పాక శాస్త్రం జీవన కళ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

వ్యాసకర్త: నారుమంచి వాణి ప్రభాకరి

మనిషికి అత్యంత అవసరమైన జీవనకళా. ఎవరి స్థాయికి వారు ఈ ఆహార అలవాట్లు ఉంటాయి. ఎవరి ప్రాంతలో దొరికేవి వారు వండి తింటారు. మనిషికి జీవన శైలిలో ఆహారం, ఆహార్యం ఆవాసము, ఆరోగ్యము ఆయుష్ ఐశ్వర్యము అన్నిటికంటే ఆహారము ముఖ్యము. ప్రతి ఇంటా వెల్లివిరిసే మధురానుభూతి ఈ కళ ! ఆహారము శుచి, శుభ్రం మడి ఆచారం అన్నిటితో ఆత్మీయ అనురాగంతో భుజిస్తే అదే అమృతము, అద్భుతము అపూర్వ ఆనందము. నా వంటలు ఈనాడు వసుంధరాలో ఆదివారం బుక్ లో 160 వచ్చాయి. వనిత, జ్యోతి, కలువబాల, ఆంధ్రపత్రిక ప్రభా, భూమి, పల్లకి, ఉదయం పత్రికలలో 1200 ప్తెగా వచ్చాయి. బాంబే డేయ్యింగ్ పల్లకి ఇత్యాది పోటీల్లో అఖిల భారత స్థాయిలో మొదటి బహుమతి వచ్చింది. ఈ టీవీ అభిరుచి, హర్లిక్స్ వంటల పోటీలో ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన పోటీలో హర్లీక్స్ ఖర్ వంటకము బహుమతి పొంది షెఫ్ రాజుగారు వండి చూపించారు. ఆయన ప్రశంసలు ఇచ్చారు. మేము పళ్ళ రసాలతో ప్రయత్నం చేశాను కానీ, వాణి ప్రభా కరి తణుకు నుంచి విన్నూత్న రీతిలో వంటకం పంపారు అని ఆనందం వ్యక్తం చేశారు. పొట్లూరి గీత గారు యాంకర్ గా ఉన్నారు.మనం తినే ఆహారాన్ని బట్టి మన స్వభావం ఉంటుంది. రుచికర భోజనం వండటం అనే అభిరుచి కూడా ఒక కళా, పాక శాస్త్రంలో నల, భీములను చెపుతారు. పుట్టిన ప్రతి మహిళ ఇందులో ప్రవిణ్యా వంతురాలే ఎంత గొప్ప, ఉద్యోగం చేసినా అంతరిక్షం వెళ్లి వచ్చినా ఆడవాళ్ళు ఆప్యాయంగా వంటింటి పోపుల డబ్బాలో అవగింజలు, అవకాయ జాడిని మరువ కూడదు. మండల స్థాయి, జిల్లా స్థాయి, అఖిల భారత స్థాయి వంటల పోటీలకు న్యాయ నిర్ణేతగా వెళ్ళాను. టాటా టీ వారి వంటల పోటీ, బాంబినో వారి వంటల పోటీ, వివిధ స్వచ్చంద సంస్థల వంటల పోటీలకు ఆహ్వానింప బడినాను.టాటా టీ వారి ఒక పెద్ద ఇంటర్నేషనల్ హోటల్ లో ఏర్పాటు చేశారు. అందులో 600 పై స్వీట్స్ తయారు చేసి తెచ్చి డిస్ప్లే పెట్టారు. ఒక్క సారి అన్ని స్వీట్స్ రుచి చూడటం ఎంత కష్టం నాతో పాటు ఒక పెద్ద ఆవిడ, ఆ సంస్థ ప్రెసిడెంట్ వచ్చారు. నేను తిని మార్కులు వేసాక ఆవిడ చూసి తిని మార్కులు వేశారు. నువ్వు చిన్న పిల్లవి కొత్త రుచులు నీకు తెలుస్తాయి. నువ్వు పుస్తకాలకి చేసి రాస్తవు నీకు తెలిసిన విషయాలు, మాకు తెలియవు అన్నారు. అన్ని పెపర్స్ లో చేసిన విధానం చదివి దానికి మార్కులు నేనే ఇచేదాన్ని అలా చాలా సంస్థలు, నా మార్కులకు విలువ నిచ్చి పిలిచి గౌరవించేవారు. మా కూడా కరంబుంది బౌల్స్ పట్టుకుని వాటర్ బోటల్ పట్టుకుని ఇద్దరు వ్యక్తులు కూడా ఇద్దరికీ అసిస్టెంట్స్ గా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం రెండు మొదలు అయిన పోటీ రాత్రి ఎనిమిదికి పుర్తిఅయ్యింది. అందరూ అలా వెయిట్ చేస్తు బయటి హాలులో కుర్చీల్లో ఉన్నారు. ఎక్కువ మంది ఉండటం వల్ల వారికి టాటా టీ వారు టీ బిస్కట్స్ సప్లై చేశారు. ఆ తరువాత మొదటి ద్వితీయ, తృతీయ మరియు 10 కన్స్సో లేషన్ బహుమతులు ఇచ్చారు. ఇది కాక వేరే గ్రూపు షాపూల నుంచి కిచెన్ ఐటమ్స్ బహుమతులు అందజేశారు. అద్భుత మైన స్పందన వచ్చింది. కాలేజి వారు టైగర్ ఫుడ్ పోటీ అని పెట్టారు. అప్పుడు మా కాలేజ్ లెక్చరర్స్, నన్ను పిలిచారు నువ్వు అయితే మాకు హ్యాపీగా ఉంటుంది. అక్కడ ముప్పయి పై పులిహోర డిష్ లు పెట్టారు. అందులో కాలేజ్ సెక్రటరీ బాగా వంట వచ్చిన అమ్మాయి ఓ పెద్ద డబ్బా నిండా పట్టుకు వచ్చి అందరికి పంచింది. పోటీకి వేరే బౌల్ లో పెట్టింది. అందరూ ముందే గానే రుచి చూసి అబ్బా ఎంత బాగుంది, అంటూ తినేసి నువ్వే ఫస్ట్ అని సౌజ్ఞాలు చేశారు. మొత్తానికి అందరివి రుచి చూసి మొదటి ఫ్రైజ్ ఆమెకు ఇచ్చాను. అందులో పోపు సమంగా ఉన్నది. అవాలు, చిట్లి కమ్మదనం వచ్చింది. పులుపు కార ము, పసుపు సమంగా వేసింది. ఇలా ఎన్నో ఎన్నో మరపురాని అనుభూతులు. తపస్వి మనోహరంలో పంచుకునే అవకాశం నా అదృష్టము ఇది జీవనకళ. జీ తెలుగు వంటల కార్యక్రమంలో, టీవీ 5 వంటల కార్యక్రమంలో పాల్గొన్నాను. మా ఇంట్లో మా అమ్మమ్మ, ఆమె చెల్లెళ్ళు, మాఇంట్లో అమ్మ అక్కాచెల్లెళ్ళు వంటకాలు అద్భుతంగా చేసి నా చేత రుచికి ముందు పెట్టీ తినిపించే వారు, అలా వంటకాల రుచులు బాగా చిన్నప్పటి నుంచీ అలవాటు అయ్యింది. కాలేజ్ వంటల పోటీ నుంచి ఎన్నో పత్రికల ద్వారా కూడా బహుమతులు వచ్చాయి. పల్లకి వార పత్రిక వారు బొంబాయి డైయింగ్ కంపెనీ వారితో కలిసి పెట్టిన వంటల పోటీలో దేశంలోని మహిళలు ఐదువేల మూడువందల ఇరవై మంది పాల్గొన్నారు. హాట్ స్వీట్, పచ్చళ్ళు, మూడు విభాగాల పోటీలో పచ్చళ్ళ విభాగంలో క్యారెట్ వాము పచ్చడికి మొదటి బహుమతి వచ్చింది. వనిత ఉగాది సంచికలో తోట కూర కారట్ మూన్ స్టార్స్ స్వీట్ కి మొదటి బహుమతి వచ్చింది. ఆ తరువాత కలువ బాల పక్ష పత్రికలో ఐదు, ఆరు సార్లు మొదటి బహుమతి వచ్చింది. మరిన్ని ఇతర పత్రికల నుంచి కూడా బహుమతులు, వచ్చాయి. జాతీయ స్థాయి  ఎన్నో పత్రిక సంస్థలు ఛానెల్స్ ద్వారా విభిన్న మహిళా సంస్థలు వారు పోటీలకు నన్ను, మా పెద్ద తల్లి సంపూర్ణ చంద్రిక సోషల్ ఆక్టివిస్ట్ బహుకళా కోవిధురాలు ఆశీస్సులతో నేను కళా స్ఫూర్తి పొందాను. తెలుగు అకాడమీ గ్రేటర్ షర్లెట్ వారు వాహిని ఉగాది ప్రత్యేక సంచికలో నా వంటకాలు వచ్చాయి. tiga విదేశీ పత్రికలలో కూడా ప్రత్యేక పండుగలకి వచ్చే పుస్తకాల్లో ప్రచురితం అయ్యాయి.
జీవనశైలిలో ఒక ప్రాణ ఆధార జీవనకళ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!