మనిషి నైజం

మనిషి నైజం

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

కష్టాల్లో మేమున్నామనే భరోసా
కన్నీరులో భాద పంచుకునే ఆసరా
చేదోడు వాదోడుగా ఉండే మనసు
జీవనపోరాటంలో దొరకని నేస్తాలు

ఖర్చు లేకుండానే పెదవి మాటలు
సహాయం అందించక నిందించును
వారి అవసరానికి మోగే మొబైల్లు
మనం ఆపదలోనవి మూగపోవును

భాద కాదు నీది తప్పంటారప్పుడు
అందరితో కలవాలని నీతులు చెపుతారు
మనం చేసిన సాయాలు మదిని వీడునప్పుడు
చెయ్యని తప్పును మీద వేస్తారు

నిందిస్తారు … అదే మనిషి నైజం
నీ అవసరం కదా నిన్నే నిష్టురాలాడాతారు
నీ కష్టం కదా!! మాకేం పట్టిందటారు
అందర్నీ వదలి వెళ్లిన నిన్ను
వెదుకుతూ వస్తారు. అదీ వాళ్ల అవసరం కోసం
సుఖం లేదు నీకు, ఉండనివ్వరు నిన్ను
అదే మానవ నైజం. ఇది నిజం

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!