బోసిపోయినట్లుంది

బోసిపోయినట్లుంది

రచన::వాడపర్తి వెంకటరమణ

చెంగు చెంగున ఎగిరే
లేగదూడల గిట్టల చప్పుళ్ళు లేవు
స్వేచ్ఛగా విహరించే
సీతాకోకచిలుకల దృశ్యాలూ లేవు

హృదయాన్ని పులకరింపజేసే
కాలి పట్టీల సవ్వడులు లేవు
స్నేహానికి భాష్యం చెప్పే
కాకెంగిళ్ళ ప్రహసనాలూ లేవు

జ్ఞాన పవనాలు వీచే ఆ చోటిప్పుడు
గాలి ఆడక నిస్తేజంగా ఎటో చూస్తోంది
పాఠాల పల్లవులు అల్లుకునే ఆ వనం
అల్లరి తూనీగలు అందుబాటులో లేక
తనలో తానే వల్లె వేసుకుంటోంది

మాయదారి మహమ్మారి వచ్చాక
అల్లరి చిల్లరి నీ అలికిడి లేక
ఇన్నాళ్లూ కళకళలాడిన ఆ విద్యావనం
ఇప్పుడు వసివాడి బోసిపోయినట్లుంది!

You May Also Like

One thought on “బోసిపోయినట్లుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!