కరోన కరోన నీకు లేదా కరుణ

కరోన కరోన నీకు లేదా కరుణ

రచయిత :: బాలాజీ చెన్నూరి

కులం లేదు మతం లేదు
పల్లె లేదు పట్టణం లేదు
ముసలి లేదు ముతక లేదు
అంతకన్నా వయస్సులో తారతమ్యం లేదు

ఏమిటీ నీ దాస్టీకం
ఏమిటీ నీ దౌర్జన్యం
ఏమిటీ నీ కరాళ నృత్యం
ఏమిటీ ఈ రావణ కాస్ట్నం
ఏమిటీ నీ ఊచకోత
ఏమిటీ ఈ భయానక నిజం

కాకూడదా ఇది ఒక భయానక స్వప్నం
కాకూడదా ఇది చిత్రం లో ఒక దృశ్యం
కాకూడదా ఇది నాటిక లో ఒక భాగం

లెదా నీకు సమాజ అంతరాలు
లేదా నీకు అంతరాత్మ
లేదా నీకు కణికరాలు

అడ్డు లేదు అదుపు లేదు
అంతకన్నా అలుపు లేదు

వేయవా తలపులు మా కష్టాలకు
వేయలేమా సంకెళ్లు నీ ముందరి కాళ్లకు

ఎన్నాళ్లీ రొద రొదలు
ఎన్నాళ్లీ కన్నీళ్లు
ఎన్నాళ్లీ సామూహిక దహనాలు
ఎన్నాళ్లీ దిక్కు లేని మరణాలు

తల్లి లేదు తండ్రి లేడు తలకొరివి పెట్టె కొడుకు లేడు
చిన్న లేదు పెద్ద లేదు
ముందు లేదు వెనుక లేదు

ఆగాలి ఆగాలి ఇంకెన్ని గుండెలు ఆగాలి
విడవాలి విడవాలి ఇంకెన్ని తుది శ్వాసలు విడవాలి
పగలాలి పగలాలి ఇంకెన్ని గుండెలు పగలాలి
వినాలి వినాలి ఇంకెన్ని చావు వార్తలు వినాలి
చూడాలి చూడాలి ఇంకెన్ని హృదయ విధారక దృశ్యాలు చూడాలి

ఆపలేమ ఈ కన్నీటి ప్రవాహాలను
ఆపలేమ ఈ గుండె కోతలను
ఆపలేమ ఈ మృత్యు గంటికలును

ఎందుకీ దాస్టీకం ఏందుకీ దౌర్జన్యం
ఆసుపత్రిలో బెడ్ లేదు తినడానికి బ్రెడ్డులేదు
చెయ్యు పట్టుకునే డాక్టర్ లేదు చెయ్యు పట్టి నడిపే నాధుడే లేడు
పీల్చ డానికి ప్రాణవాయువు లేదు
పోవడానికి మాత్రం ప్రాణం ఉంది

ఎందుకీ భయనకం ఎందుకీ భయోత్పాతం
ఇకనైనా చల్లారవా ఓ పేలిన అగ్నిపర్వతాల శ్రేణి
ఇకనైనా కరుణించి మమ్ములను కాపడవా

తండ్రి లేడు తల్లి లేదు
భర్త లేడు భార్య లేదు
చెల్లి లేదు అక్క లేదు
అన్న లేడు తమ్మి లేడు
కానీ ఉంది మాలో చైతన్యం
ఉంది మాలో దేశీయత
ఉంది మాలో జాతీయత
ఉంది మాలో సచూడాల
తరిమి కొడతాం తరిమికొడతాం
నాలో నుంచి తరిమి కొడతా

మాలో నుంచి తరిమి కొడతాం
వీధి లో నుంచి, గ్రామం లో నుంచి తరిమి కొడతాం
జిల్లా నుంచి తరిమి కొట్టి రాష్టమునుంచి తరిమి కొట్టి
ఏకంగా నా దేశం నుంచి
తరిమి కొట్టి తరిమికొట్టి నీకు తలకొరివి పెడతాం..

You May Also Like

One thought on “కరోన కరోన నీకు లేదా కరుణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!