నా మగడు 

నా మగడు 

రచయిత :: ప్రసాదరావు రామాయణం

మొరటోడు నా మగడు
మోహమంతా రక్కాడు

మన్మధుడే అనుకున్నా
మురిసి మురిసి మనువాడా

కందుడే అనుకున్నా
మందు వేస్తాడనుకోలే

చెక్కిలంతా గాయాలే
చక్కిలాలనికొని నమిలాడే

కురులను బట్టి.లాగాడే
తరువులనుకుని వూపాడే

తేనేపట్టనుకున్నాడే
పెదవుల పిండాడే

కన్నులెర్రబడేను
కన్నీళ్లకు మొదలుగా

పిండిలాగా పిసికాడే
నడుమనుకున్నాడో కుడుమనుకున్నాడో

సూర్యోదయమైనదిక చాలంటే
స్వర్ణరేతుని తిడతాడే

వడలిపోయిన వంగపూవును
కడదాకా నమిలాడే

తడసిపోయిన మల్లె చెండుతో
బంతి ఆటలాడుతాడే

మొరటోడు నా.మగడు
మురిపాలకు తావు లేదు
సరసాలకు సరిపోడు

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!