విడుపు

విడుపు

రచయిత :: మీసాల చిన గౌరినాయుడు

అంగన కనిపించినంతనే
అర్రులు చాసుకుంటూ
అరక్షణం ఆగక
కామాక్షువులు రంకెలేస్తాయి
అంగాంగ వీక్షణకోసం..
ఎంతైనా…అవి
మగ కళ్ళుకదా!!

కాంతలు చెంతనున్నంతనే
అరఘడియ ఆగకుండా
కండ కావరపు కాళ్ళు ఉరకలేస్తాయి
అమాంతంగా ముళ్ళ కౌగిళ్ళ లో ముంచడానికి…
ఎంతైనా….అవి
మగ కాళ్ళు కదా….

పడతులు పలకరించినంతనే
మరుక్షణం వేగలేక
మస్తిష్కం మత్తెక్కి
కామపు కరములు
విరుచుకుపడతాయి..
రాబందుల విరహదాహం
తీర్చుకోవడానికి…
ఎంతైనా…
అవి…మగ చేతులు కదా

ఆ మగ అన్నపదమే వాటికి
బలమైతే దానిని తెగనాడాలి.
ఆ పదమే వాటికి తోడైతే
దానిని విడనాడాలి…..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!