మువ్వల సవ్వడి

మువ్వల సవ్వడి

స్వయంప్రభ.మధుమాసవీణ✍️

మువ్వల సవ్వడి ..
పదబంధన భావాల ముట్టడి..
మది అంతరంగాన్ని మీటే మధుర కావ్యాకవనాల స్వరాలి..
ప్రతి కావ్యం భావాల ఊహల పల్లకీలో ఊరేగే ఉత్సవాలే..
అక్షర మల్లెసువాసనలు వెదజల్లే పరిమళాలు మీచేతి కవనాలు..
ప్రేమ భావాలు తెలుపుటకు మొగలిరేకుల సువాసనలు..
వాస్తవాలకు నిలువుటద్దాలు..
వెలిగే జ్ఞాన దీపికలు..
స్వేచ్ఛ భావాలను తెలుపుటకు గగనసీమలో స్వేచ్ఛగా విహరించే రెక్కలొచ్చిన పావురాలు..
ఆకాశవీధిలో జిగేలు జిగేలుమంటు మెరిసే నక్షత్రాలు..
నిజానిజాలు గ్రహించి ఆచరిస్తే జీవనవిధాన సూత్రాలు..🙏💐💐..

జ్యోతి గారి కవిత్వం🌹🌹
“”””””””'””””””””””””””””””
నిరంతర అక్షర అన్వేషణలో సాగే పయనం కల్పననైనా వాస్తవమైన మూగబోయిన గుండెల్లో రగిలే భావాలకు రంగులద్ది కఠిన శిలలాలోనైనా
చలనం కలిగించి పసిపిల్లల బోసి నవ్వుల ముసి ముసి నవ్వుల భావమే మన జ్యోతి మువ్వల గారి కవిత్వం..🙏💐💐….

అంకిత భావంతో అమ్మానాన్నలకు
పాద నమస్కారలు చేస్తూ అక్షరమాలతో సమర్పించుకున్న
“మువ్వల సవ్వడి”శ్రోతలకు అందించిన జ్ఞానపందిరి..🙏💐💐…

ముందుమాటగా…..
“”””””””””””””””””””””””””””
అక్షర తపస్వి..
ప్రభుత్వ గుర్రం జాషువా అవార్డు గ్రహీత..
డాక్టర్ కత్తిమండ ప్రతాప్ గారి మాటల్లో..
కొన్ని గుండెల సవ్వడి..
ఈ మువ్వల సవ్వడి..
అక్షరంలో రూపంలో నిగూఢమైన ఆ శక్తి కవిత రూపంలో విస్పోటనం చెందితే ఆ కవిత్వం సమాజహితాన్ని కోరుతుంది”కదిలేది, కదిలించేది, పెనునిద్దుర, వదిలించేదీ, పరిపూర్ణపు బ్రతుకిచ్చేదీ , కావాలోయి నవ కవనానికి, అని అభ్యుదయ కవిత్వపు నిజ లక్షణాలన్నీ ఎలుగెత్తిన మహాకవి శ్రీశ్రీ గారు అని తెలుపుతూ..
సహస చైతన్యపు అక్షరాలు ఒకవైపు..
మరోవైపు మమతల తీగలకు కట్టినట్లుగా కవిత్వం బాధ్యత చేపట్టింది మన జ్యోతి గారి కవిత్వం ఎందరికో స్ఫూర్తి నివ్వాలని స్ఫూర్తిదాయకంగా నిలవాలని మరెన్నో కవనాలు రచించాలని ముందుమాటగా తెలిపారు..🙏💐💐….

నారం శెట్టి ఉమామహేశ్వరరావు గారు.
“”””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””
కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత..
సాహిత్యరంగంలో మువ్వల సవ్వడి వినిపిస్తున్న కవిత్రి జ్యోతిగారు..
కవయిత్రి జ్యోతి గారికి తల్లిలా లాలించి చేయడం తెలుసు ఆదిపరాశక్తి లా మారి అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసు అనే సత్యాన్ని ధ్రువీకరించి ఎందుకు రెండు కవితలు ఉదాహరణగా నిలుస్తున్నాయి అని తెలిపారు..
“కవిత్వం అంటే నిగూఢ అర్థాలతో పదాలను పొందుపరిచే గని అక్షయముగా అక్షరాలు నింపుకున్న నిధి
కవిత్వమంటే కాదురా బడి
సమాజానికి పాఠాలు నేర్పే బడి”
వారి దైన శైలిలో చాలా చక్కని పదాల అల్లికలతో స్ఫూర్తిదాయకమైన మాటలను తెలియజేశారు ..🙏💐💐…

కళారత్న డా.జి.వి పూర్ణచందు.
“”””””””””””””””””””””””””””””””””””””””””
“ఊహలతో చిత్రించుకున్న ఊహాచిత్రాల గలగల మువ్వల సవ్వడి”
కవిత్వమంటే కవి మదిలోని
జహలకు ఊహాచిత్రం
కవిగారి కనిపించని మనోనేత్రం కవి మదిని తెరిచే పుస్తకం
కవిత్వమంటే కాదురా బడి సమాజానికి పాఠాలు నేర్పేబడి
మబ్బుల చాటున దాగిన ఉషోదయం
మూతి ముడుచుకుంది తొలి కిరణం “మువ్వల సవ్వడి” మువ్వల జ్యోతిగారి కవిత్వాన్ని వివరిస్తూ తెలిపారు..🙏💐💐..

తరిమిశ జానకి గారు
“””””””””””””””””'”””””””””””””
ప్రముఖ రచయిత్రి ,కవయిత్రి..
అంగడి లో దొరికే వస్తువు కాదు అనుబంధం..
సంస్కారంతో కలుపుకో ప్రతి ఋణానుబంధం అంటారు అనుబంధం కవితలో..
మతమన్నది మనిషినీ, మనిషినీ విడదీయడానికి పుట్టిందా ఆలోచించి చూడమంటారు మానవత్వమే అభిమతం కవితలో..
తరిమి జానకి గారు చక్కని విశ్లేషణ భావంతో..🙏💐💐..

డాక్టర్ శ్రీనివాస్ వాసుదేవ్ గారు
విజిటింగ్ ప్రొఫెసర్..
“””””””'””””””””””””””””””””””””””””””””””
మురిపించే మువ్వలు సవ్వడి
మువ్వల జ్యోతి గారి కవిత్వం అంటూ..
ప్రతి కవీ మనిషే కాని ప్రతి మనిషి కవి కానేరడు..
మనిషిలోని సృజనాత్మకత
వివిధ రకాలుగా వ్యక్తమౌతుంది. అందుకె కవిత్వం తీరుతెన్నులు గురించి హృదయానికి మధ్య ఎడతెగని ఘర్షణే కవితానుభవం తన స్వప్నలిపిలో అజంతా అన్నట్టుగా “కవిత్వం ఒక రహస్య క్రీడే” ఐతే అందులో పాఠకుడు ఒక భాగస్వామంటు
తెలియజేశారు…🙏💐💐..

మువ్వల జ్యోతిగారి కవిత్వాలలో పరకాయ ప్రవేశం చేస్తే….!!!
మువ్వల జ్యోతి గారు మొత్తం రచించిన కవితా కవనాలన్ని
144 కవితా పుస్తకాలతో సంకలనం “మువ్వల సవ్వడి” నామకరణతో పాఠకుల మది తీరాన్ని చేరుకున్నాయి కవనాల సవ్వడిగా..🙏🌹
మొదటి కవితే “బంధుమిత్రులు” ఆర్థిక సంబంధాలకు విలువిస్తూ ఆత్మీయతను మరిచిపోతున్నము అని తెలుపుతూ..
పుట్టుకతో పేగుబంధం..
పెళ్లితో ప్రేమానుబంధం.. మరువరానిది ఈ ఆత్మీయ బంధం..
మానవ సంబంధాలను డబ్బుతో ముడి పెట్టకూడదు అంటూ చాలా చక్కగా వివరించారు.. అనుబంధాల గురించి బాగా వర్ణించారు.🙏🌹..
అతిథిలా రావలసిన వాన
పిలవని పేరంటానికి వచ్చినట్టు
ఊరు వాడను ఏకం చేస్తూ కరువు కాటకాలను దోసిట మోసుకొస్తూ జనసంద్రాన్ని
జలదిగ్బంధం చేసింది..
ఓ వరుణ దేవా నువ్వు శాంతించి సూర్యభగవానుని ఈ భూమిపైకి పంపించు
కాస్తయినా మాకు ఊరట కలిగించు చాలా చక్కని భావజాలంతో వివరించారు.. 🙏🌹…

శ్రమను దోచి నడ్డివిరిచిన
దోపిడి తనానికి స్వస్తి పలుకుతూ
సమన్యాయం కోరుతూ
ప్రశాంత హృదయానికి సాగే పోరాటంలో
ఏమున్నది ఘనచరిత్ర ..
గాలి బుడగ వంటి జీవితాలకు భరోసా కల్పిస్తూ..
విప్లవ గీతాలు రచించారు భావోద్వేగమైన పద భావాలతో కవన రూపంలో తెలిపారు..
అందరి గుండేల్లో సడి చేశారు.🙏🌹…

మగువ జీవితాన్ని పుట్టింటి నుండి మెట్టినింటివరకు తన పయనాన్ని శ్రీ సౌభాగ్య అనే మాటలతో చాలా అందంగా వివరించారు స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని సగర్వంగా చాటి చెప్పేలా..🙏🌹..
మరికొన్ని కవనలు..
ప్రపంచ శాంతికై
ఆయుధాలకు స్వస్తి పలుకుతూ
అభివృద్ధిలో చేయూతనిచ్చి తెలుపు నలుపు భేదం విడిచి ఐక్య ముత్యానికి ఆయువు నీవు..
శాంతి మార్గానికి నీ వంతు కృషిని చేస్తూ..
మానవ జీవితాలను చేయాలి సుఖమయం..
చక్కని పదజాలంతో మానవతా విలువలను ఉట్టిపడేలా ఈ కవిత తెలుపుతోంది..🙏🌹…

మానవత్వమే అభిమతం
నా అభిమతమంటు. రైతు దుస్థితి కాదు దారుణమని తెలియజేస్తూ, జీవచ్ఛవాలు కాదు మనం మనుషులం,
మరుగైన మనిషి తత్వం
ప్రకృతి రక్షణ మన రక్షణ,
కులం వికృత చర్యలు,
శాపంగా మారిన ముసలితనం,
ఇలా ఎన్నో కవనాలు మువ్వల జ్యోతి గారి కలం నుండి జాలువారే ఆణిముత్యాల ప్రవాహమే ..వజ్రాలా మూటలా వైభోగమే.
అద్భుతాలు చూపిన ఈ అక్షరాలకు వందనమే అభివందనమే..
జ్యోతిగారు కవనాలు
వాస్తవాలను కళ్ళకు చూపే
సూర్య ప్రకాశంలా వెలుగులు విరజిమ్మే కాంతి కిరణంగా
వెన్నెల కాంతులు వెదజల్లేలా
నా మది అంతరంగంలో చెరగని పీటలు వేసుకుని కవనలన్ని అది కలమా కష్టాలను కడతేర్చే తీరమా అన్నట్టుగా..
జ్యోతి గారి కలం నుండి మరిన్ని కవనాలు వెలువడాలి సంకలనాలు అవ్వాలి.
పాఠకుల అంతరంగంలో చోటుచేసుకోవాలి చెరగని ముద్రలు వేసుకోవాలి..
మీ కవిత్వం మాకు స్ఫూర్తినిస్తూ స్ఫూర్తిని తెలియజేస్తూ స్ఫూర్తివంతంగా నిలిచిపోయాయి గగనసీమలో .
మిల మిల మెరిసే తారకల్ల
మాకు (పాఠకులకు) ఇన్ని కవానలు అందజేసిన మువ్వల జ్యోతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు…
నాప్రేమపూర్వక కృతజ్ఞతలు🙏💐😊..
“”””'”””””””””””””””””””””””'”””””””'””’'”””””
మువ్వల జ్యోతి గారి కవనలన్నీ చదివిన తర్వాత నాలో భావాన్ని మీకు తెలియజేయాలని రాసానండి
తప్పులుంటే క్షమించండి…🙏

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!