అమ్మ కదా!

అమ్మ కదా! (మా అమ్మ వాడపర్తి లక్ష్మి)

రచయిత:: వాడపర్తి వెంకటరమణ

నీకు జన్మనివ్వడానికి ఆమె మరో జన్మ ఎత్తింది
పొత్తిళ్ళలో నిన్ను చూసినప్పుడు
పసి నవ్వుల పాపాయి అయిపోయింది
పడి లేస్తూ నువ్వు నడక నేర్చుకుంటున్నప్పుడు
తన చేయందించి ఈ లోకాన్ని పరిచయం చేసింది
డొక్కమాడి నువ్వు మెలి తిరుగుతున్నప్పుడు
తన రక్తాన్ని పాలగామార్చి క్షుద్బాధ తీర్చింది
నీకు ఉష్ణమొచ్చి వణుకుతున్న వేళ
నీ కోసం దివారాత్రులు లంకణాలు చేసింది
నలుగురికీ నువ్వు మంచి పంచడానికి
జ్ఞాన విత్తులు చల్లి ఆది గురువయ్యింది
ఏ కష్టాల కార్చిచ్చు నీ చుట్టూ కమ్మకుండా
తన రెక్కల్లో పొదువుకుని కాపలాదారయ్యింది
ఉన్నపళంగా స్వార్థంతో నువ్వు రోడ్డున పడేస్తే
బాధను గుండె అరలో అదిమిపెట్టి
నీ క్షేమం కోరుకుంది
ఎందుకంటే… ఆమె అమ్మ కదా!
***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!