ఆత్మీయ నేస్తానికి పుట్టినరోజు శుభాకాంక్షలు

ఆత్మీయ నేస్తానికి జన్మదిన శుభాకాంక్షలు
♥️Happy Birthday Deepu♥️

అందమైన కథలో పొదిగేందుకు..
పదం ఎదురు చూడటం సహజమే కానీ…
ఓ కథ తను ఎలా ఉందని తెలుకోడానికి..
అందమైన పదాల కోసం ఎదురు చూడటం..
ఆ పద సమీక్షలో తనని చూసుకుని మురిసిపోవడం అంటే ఏమిటో.. తెలియాలంటే…
మా దీపు పదసమీక్ష మీరు ఓసారి చూడక తప్పదు.

తన భావం ఎంత అందమైనదో..
తన మనసు కూడా అంత స్వచ్ఛమైనది
తన నవ్వులు అల్లరి చేస్తాయి..
తన మాటలలో గోదారి సవ్వడులు వినిపిస్తాయి
ఆ సవ్వడిలో భాగమై
తన జీవన గమనంలో నేస్తాలమై
అందమైన అనుభవాలను పోగు చేసుకుంటూ
తనతో సాగే ఈ స్నేహ పయనం అనంతంగా
సాగాలని…

సత్య అన్నలో సగభాగమై..
హనీ.. మౌషిల బంగారు భవిష్యత్తుకు
అనుక్షణం ఆరాటపడే..
ఆ తపస్వి అక్షరాలకు మురిసి..
యశోదమ్మ అయిన మా ఆత్మీయ నేస్తం..

దీప్తి(దీపు)కి పుట్టిన రోజు శుభాకాంక్షలు 💐

♥️బుజ్జమ్మ, విజయ♥️

అమ్మతనంలోని కమ్మదనం..
ఆత్మీయ పలకరింపు..
సుతి మెత్తగ దండించే
మాటల పొందిక..
చిరునవ్వుల స్నేహం..
అన్ని కలిపిన మా యశోదమ్మకు
పుట్టిన రోజు శుభాకాంక్షలు💐

♥️బిందు, లక్ష్మి, నిమ్మగడ్డ కార్తిక్♥️

ఆప్యాయత అనుబంధాలకు
బాంధవ్యాల బాధ్యతకు
ప్రేమానురాగాలు పంచే
అందమైన మనసున్న
ఆనందాల చిరునామా ..చమత్కార చతురతతో
చెక్కిలిని మెరిపించే చక్కదనం
మధురమైన గాత్రంతో
మనసుని మాయచేసే సుస్వరాల సౌధం

బిజీ లైఫ్ లో కూడా
ఈజీగా సాహిత్యాన్ని రచిస్తూ
ఉపయోగకర సమీక్షలతో
రచనల్ని ప్రోత్సహించే రచయిత్రి
మా దీపుకు ఆనందాల పుట్టిన రోజు శుభాకాంక్షలు

♥️ సుధేష్ణ♥️

మాటలకు అందని మాధురానుభూతి తన పరిచయం.
చూడగానే మనసు పొరల్లో ముద్రించే ఆమె రూపం అమృత వదనం ఆమె సొంతం.
అలసిన మనస్సుకు వెన్నెలై,
విరజాజుల సమీరాలై నిలిచే ఆమె ప్రేమ
తనతో పాటు ఎన్నో కనులకు వెలుగులు పంచే రవికిరణం ఆమె వ్యక్తిత్వం
మునుపటి జన్మలో ముడిపడు పుణ్యమే నీ స్నేహమై,
నా జీవితాన్ని పూల బాటగా మార్చిన
నా ప్రాణ స్నేహితురాలికి..
నా ప్రేమనంతా ఆలపనగా,
ఆశీస్సులుగా మలిచి
మా కుందనపుబొమ్మ జీవితం
వెయ్యి వసంతాల చిరునవ్వుల చిరునామాగా..
ఎన్నో వేడుకలు, సంతోషాలతో,
ఆనందంగా జరుపుకోవాలని
సదా ఆ భగవంతుని వేడుకొంటూ
జన్మదిన శుభాకాంక్షలు దీపు💖💐

♥️జయ♥️

హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు దీపు💐

From

తపస్విమనోహరం &టీమ్

You May Also Like

10 thoughts on “ఆత్మీయ నేస్తానికి పుట్టినరోజు శుభాకాంక్షలు

 1. హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు మేడం
  జీవితం అంతా ఆ యు రారోగ్య అష్ట ఐశ్వర్యాలతో ప్రశాంతంగా ఉండాలి.

 2. పుట్టినరోజు శుభాకాంక్షలు బాపు బొమ్మ ముద్దు గుమ్మా మా యశోధమ్మ అందరికి వెలుగులు పంచె దీపమ్మా… సంతోషంగా నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటున్న మరో సారి పుట్టినరోజు శుభాకాంక్షలు లేడీ డాన్ వీర ❤️❤️💐🎂🍫😍😍

 3. నా గుండెల్లో గోదారమ్మ…

  అమ్మ ప్రేమను పంచుతూ..
  అక్కగా అండగా ఉంటూ..
  చెల్లెలై సరదాగా కబుర్లు చెప్తూ..
  నేస్తంలా వెన్నంటి వుండే..
  ప్రేమబంధం మా యశోదమ్మ🌹

  అమ్మకు మరో రూపమా
  ఆదిశక్తి అవతారమా
  అతిలోక సౌందర్యమా
  ఆప్యాయత పంచే అనురాగమా
  నాలోని ఓ అలౌకిక భావమా
  ఎవరో ఈ వెన్నెల్లో.. గోదారమ్మ 💞

  విరిసిన మందారం ఆమె
  కమ్మని ఓ ప్రేమ సరాగం ఆమె
  అక్షరాలకు అందని భావం ఆమె
  తరగని ప్రేమ సన్నిధి ఆమె
  అసూయలేని అమ్మ మనసు ఆమె
  పరిపూర్ణ వ్యక్తిత్వానికి ప్రతీక ఆమె
  ప్రతి.. ఆమెకి ఆదర్శం… ఆమె..
  ఆమె మా దీపమ్మ.. ❤️

  అరుదైన మన స్నేహం ఎల్లప్పుడూ ఇలాగే..
  ప్రేమ పరిమళాలు విరబుస్తూ వుండాలని కోరుకుంటూ..
  మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు నేస్తం 💐
  … నీ బుజ్జమ్మ🥰

 4. పుట్టినరోజు శుభాకాంక్షలు దీపు💖💐💐💐
  God bless you దీపు💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!