ధైర్య పవనం కావాలి

 ధైర్య పవనం కావాలి!!

రచయిత:వాడపర్తి వెంకటరమణ

కాలమిప్పుడు విషాద గీతాలు ఆలపిస్తోంది/
మనిషి చేస్తున్న లెక్కతెగని తప్పిదాలకు/
పగబట్టిన త్రాచులా బుసలుకొడుతూ/
కంటికి కనపడని క్రిమిలా మారి/
నిలువెల్లా విషపు చినుకులు చిమ్ముతోంది!/

కాలమిప్పుడు కఠినంగా ప్రవర్తిస్తోంది/
నిరుడు వికృతంగా తెగిపడ్డ శకలాలను/
నిక్కచ్చిగా ఇంకా ఏరుకునేలేదు/
మళ్ళీ ఆ జీవితాలపై కొండచరియలా/
విరుచుకుపడి విలయతాండవం సృష్టిస్తోంది!/

కాలమిప్పుడు ధ్వంస రచన లిఖిస్తోంది/
బంధాలు బంధుత్వాలని తేడాలేక/
వసంతవనంలో పెను తుఫాను రేపి/
కన్నప్రేమను సైతం కన్నీరు మిగిల్చి/
విధ్వంసంలా మరణ మృదంగం మ్రోగిస్తోంది!/

ఎన్నెన్ని కష్టాలు జనగణం పడుతున్నా/
ఈ కర్కశ కాలానికి కనికరమే లేదు/
జడలువిప్పి పంజా విసురుతూనేవుంది/
ఇప్పుడు భయమనే భూతద్దం కాదు/
గుండెల్నిండా భరోసా నింపే ధైర్య పవనం కావాలి!!

You May Also Like

12 thoughts on “ధైర్య పవనం కావాలి

  1. ఈ పరిస్థితిలో కావాల్సింది ధైర్యమే. చాలా చక్కగా చెప్పారు మిత్రమా

  2. ప్రస్తుత పరిస్థితులను మీ కవితలో చక్కగా ప్రతిబింబించేలా రాశారండీ.. చాలా బాగుంది అండీ.

  3. ప్రస్తుతాన్ని చూపించారు.. చేయాల్సిందేమిటో కూడా చెప్పారు. బాగుందండీ!! 👏👏👏

  4. వర్తమాన దయనీయ బతుకు చిత్రం
    బాగుంది.
    నిరుడు వికృతంగా తెగిపడ్డ శకలాలను
    నిక్కచ్చిగా ఇంకా ఏరుకునేలేదు.
    👌

  5. కవిత ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!