అలజడుల స్వప్నమై

అలజడుల స్వప్నమై

రచన: వాడపర్తి వెంకటరమణ

కొన్ని కొన్ని సార్లు మన కళ్ళకు
ఏ మాయా మబ్బులో కమ్ముకుని
మరికొన్నిసార్లు మన చెవులకు
ఏ మాటల చెడుగాలో చేరుకుని
మనల్ని తనలోకి లాగేసుకుంటాయి

అదిగో అప్పుడే…
నిజానిజాల విచక్షణ మరచి
మనస్పర్థల మాల మెడలో వేసుకుని
ప్రశాంత స్నేహ పవనాలను నెట్టేస్తాం

ఇన్నాళ్లూ ప్రాణమనుకున్న
స్నేహ సౌధం ఒక్కసారిగా కూలిపోయి
మానస క్షేత్రంలో శిధిలమైపోతుంది

హృదయాంతరాలలో నిగూఢమైన
స్నేహ బంధం భళ్ళున పగిలిపోయి
అలజడుల స్వప్నమై మనల్ని
అనునిత్యం గుచ్చుకుంటూనేవుంటుంది!

You May Also Like

One thought on “అలజడుల స్వప్నమై

  1. చాలా బావుంది సర్…. కొద్దిలో ముగించే శారు…. అయినా బావుంది…. అభినందనలు💐💐98

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!