దివ్యాంగులు
రచన: లోడె రాములు
“ఇది సచ్చింది లేదు..బతికింది లేదు
ఏమి చేయ్యాలయ్యా!!.దేవుడా!!
ఎలా వేగాలి కడవరకు దీంతో…”
మానసిక వికలాంగుల తల్లిదండ్రుల
రోదన.. ఆవేదన..
ఎంతో మంది తల్లిదండ్రులు వదిలించుకున్న దివ్యాంగులకు
చిటికెనవేలు అందించి సేవలందిస్తున్న ఆశ్రమాలకు శత కోటి వందనాలు..
మానవతా పునాదులుగా నిలుస్తున్న దాతలెందరో మహానుభావులు..
ఆకలి అని ఎలా చెప్పాలో తెలియదు
దాహమని ఎలా అడగాలో అర్ధం కాదు
నిద్ర ఎప్పుడు పోవాలో,
ఏమి చెయ్యాలో తోచదు..
ఎవరు ఏమి చెప్పినా స్పందించలేని స్థితి.. మానసిక వైకల్యం..
పూర్వజన్మలో చేసుకున్న పాపంగా భావించే అమ్మానాన్నలూ ఉన్నారు
కానీ..దివ్యాంగులకే తగిన శిక్షణ ఇస్తే
బంధుత్వాలను పరిచయం చేస్తూ
కుటుంబం, స్నేహం, అభిమానం, వంటి విలువల అనుభూతుల్ని పంచుతూ.. ఓపిగ్గా చెబితే…
శిక్షణలన్నీ పూర్తి చేసుకొని
బయటి ప్రపంచానికి వచ్చే…
ప్రతి విద్యార్థి తనని తాను తెలుసుకుంటే చాలు…
సమాజానికి తన చేయి అందిస్తారు
జీవితంలో చిరునవ్వులు పూయిస్తారు