పచ్చని హృదయం

పచ్చని హృదయం

రచన: చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)

వ్యాపార రహస్య పుటల్లో
సహజ వనరులు తిష్టవేశాక
అద్దాల మేడలో దాక్కుంటాడు తప్ప..
రక్షణ తంత్రాలను వినియోగిస్తాడా…?

మనసు మెడపట్టేసినా
ఆకాశ హార్మ్యాలను తలెత్తి చూస్తూ
బతుకుతాడు తప్ప
నేల చూపులు చూస్తాడా…?

మట్టి రుచి చూడక బతకలేని మొక్క
ఆ వాసనకై నకనకలాడుతుంటే
పెరడునే నెత్తికెత్తుతాడు తప్ప
వృక్షం అడుగు ధరణిని తాకనిస్తాడా…?

ఆహారౌషధాలు తరువుల కాయాల్లో
భద్రంగా ఉంటాయని తెలుసుకొని
ఆ హరిత గుండెలు చీల్చుతాడు తప్ప
పచ్చని హృదయాలను సృష్టిస్తాడా…?

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!