మనసు చేసిన మాయ

(అంశం:”అపశకునం”)

మనసు చేసిన మాయ

 

రచన::అరుణ చామర్తి ముటుకూరి

రామన్”, అంటూ వచ్చాడు శంకు.
“రారా శంకు” ఆప్యాయంగా ఆహ్వానించాడు చిన్ననాటి మిత్రుణ్ణి .
“ఏమిట్రా !ఎవరూ లేరు ఆసుపత్రిలో ”
” నువ్వు వస్తున్నావ్ అని పేషెంట్లను త్వరగా చూసి పంపించి ఖాళీగా కూర్చున్నా” జవాబిచ్చాడు రామన్
“ఆ.. నేను వస్తున్నట్లు నీకు ముందే తెలుసా?” ఆశ్చర్యపోయాడు శంకు.
“లేదు లేవోయ్ , ఏదో పరాచికాలు ఆడాను” సర్దుకుని చెప్పాడు రామన్.
నిజానికి శంకు ఆసుపత్రికి వస్తాడని ముందే తెలుసు రామన్ కి. రెండు కుటుంబాల మధ్య మితృత్వం బానే ఉండడంతో శంకు భార్య ఫోన్ చేసి చెప్పింది. దాంతో శంకు కి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆలోచించి అన్ని రెడీగా ఉన్నాడు రామన్.
అంటే శంకు కి ఏదో భయంకరమైన జబ్బు వచ్చిందనో, మరేదో ఊహించుకోకండి. సరిగ్గా పది రోజుల క్రితం, శంకు బయటకు వెళ్తూ ఉండగా, పై నుండి తల మీద ఏదో పడినట్లుగా అనిపించింది. బల్లేమో అనుకున్నాడు. గబగబా ఇంట్లోకి వచ్చి కంచి లో బంగారు బల్లి ని పట్టుకున్న వాళ్ళ అమ్మని, పట్టుకుని స్నానంచేసి బయటికి వెళ్లాడు. ఆరోజు అన్యమనస్కంగా బండి నడుపుతూ, రోడ్డుమీద ఉన్న గుంట చూసుకోకుండా, నడపడంతో చెయ్యి కొద్దిగా బెణికి నట్టయింది. ఇంటికి రాగానే , పొద్దున ఇలా జరిగింది అని అమ్మతో చెప్పాడు కొంచెం భయంగా.
“ఏం కాదులే ,తక్కువలో పోయింది గా.. “అని వాళ్ళ అమ్మ తేలిగ్గా తీసుకున్నారు.
కాని ఆ రోజు నుంచి మనసులో ఏదో తెలియని భయం. తల మీద పడింది కాబట్టి తనకేదో గండం రాబోతోందని ,అది ప్రాణ గండమే అని బలంగా నమ్మ సాగాడు. అతని ఆ నమ్మకాన్ని తలలు పట్టుకున్నారు ఇంట్లో వాళ్లంతా. అదిగో అప్పుడే రామన్ గుర్తుకు వచ్చి , చెయ్యి చూపించుకో మని అతన్ని పంపించి ఈ విషయం అంతా రామన్ కి చేరవేసింది అతని భార్య భైరవి.
కలిసి చదువుకున్న రోజుల నుంచి అతనీ నమ్మకాలు ఎంత బలంగా విశ్వసిస్తాడో తెలిసిన వాడిగా.. ఇప్పుడు మంచి అవకాశం దొరికింది ఇదంతా పోగొట్టాలి అనుకున్నాడు రామన్.
“విషయం ఏంటి చెప్పు”తెలియనట్లుగా అడిగాడు
” అంతా చెప్పి, నవ్వద్దు నువ్వు చిన్నప్పటి నుంచి నన్ను చూసి నవ్వేవాడివి ఇలాంటివి చెప్తే. ఇక నువ్వు డాక్టర్ చదువు చదివేక, మరీ ఇలాంటివి ఎగతాళి ఎక్కువైపోయింది” ముందరి కాళ్ళ కిబంధం వేస్తూ అన్నాడు.

“సరే, ఏమీ అననులే కానీ, నాకు ఒక రోజు సమయం ఇస్తావా.. పెద్ద డాక్టర్ల నీ,మా గురువులను సంప్రదిస్తా..” మనసులో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ సంయమనంగా అడిగాడు.

“సరే మరి, చెయ్యి పరిస్థితి ఏంటి?”

“ఇదిగో నా దగ్గర ఉన్న టాబ్లెట్లు ఇస్తాను వేసుకో రోజుకొకటి” అంటూ మల్టీవిటమిన్ టాబ్లెట్ లు ఇచ్చి పంపించాడు.
**
మరో రోజు ఆదివారం కావడంతో నేనే ఇంటికి వస్తున్నాను అంటూ.. ఎవరు చేసాడు రామన్ శంకర్ కి.
“చూశావా నా స్నేహితులు అంటే అప్పుడే పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడి పరిష్కారం తెలుసుకున్నాడు”ఉప్పొంగి పోతూ ఇంట్లో వాళ్లకు చెప్పాడు.
రామన్ రాగానే, ఒక పెన్ డ్రైవ్ తీసి కంప్యూటర్లో పెట్టమని ఇచ్చాడు. ఆన్ చేసి, రాబోయేది సరిగా గమనించు అని చెప్పాడు స్నేహితుడికి.
అందులో రెండు రోజుల సీసీ ఫుటేజ్ తాలూకు వీడియో ఉంది. మొదటిరోజు అంటే తను బల్లి మీద పడింది అనుకున్న రోజు, లాక్ డౌన్ ను ఇంట్లో ఉండే పిల్లలకు బోర్ కొట్టి, రబ్బర్ బల్లి తో దానికి ఒక ఎలాస్టిక్ ఉంది మీదకి కొట్టి ఆడుకుంటున్నారు. ఆ ప్రాసెస్ లో అది కొద్దిగా కిందికి వచ్చి, అతని తలకు పూర్తిగా తగ్గలేదు కానీ, కొద్దిగా జుట్టుకి తగిలింద ఏమో అని అన్నట్టుగా వచ్చింది. వెంటనే ఎలాస్టిక్ తొడలపైకి లాగడంతో ఏం తెలియలేదు.అయినా, బల్లి పడిందేమో, అన్న శంకతో , ఇంట్లో దానికి తగ్గట్టుగా ఏదో చేసుకుని బయట కూడా అన్యమనస్కంగా బండి నడిపి అంతదాక వచ్చింది పరిస్థితి.
ఇక రెండో దానిలో, నిజంగానే అతని తల మీద నుంచి బల్లి పాకింది. అయితే అతను అది గమనించలేదు. ఏదో ఫోన్ మాట్లాడుతూ అదాటున వెళ్లిపోయాడు. ఆ రోజున అతనికి ఏమీ కాలేదు.
చూసావా, ఇదంత నీ మనసు చేసిన మాయ. మొదటిరోజు బల్లి కాకపోయినా, బొమ్మే అయినా ఏదో భయంతో నువ్వలా ప్రవర్తించావ్. కానీ రెండో రోజు, గూడూరు చేస్తే ఇంకా బాగుంటుంది నీకు ఆ విషయం దృష్టిలో కే రాలేదు. కాబట్టి మనసులో ఎలాంటి శంకా లేదు. హాయి గా ఉన్నావు. చూశావా నీ అర్థంలేని భయం.”స్నేహితుడికి విపులంగా చెప్పాడు.

“సరే విషయం నాకు తెలియకపోయినా బల్లి నా తలమీద వెళ్ళింది కదా! మరి ప్రమాదం అంటావా?”

హుష్షు.. అని తల పట్టుకుని, ఇక లాభం లేదనుకుని.. ఒరేయ్ కాస్త మనసుపెట్టి విను చెప్తాను. ఒకప్పుడు మట్టి ఇళ్ళు ఉండేవి. కరెంటు కూడా ఉండేది కాదు. బల్లి విషపూరితమైనది కాబట్టి, మన ఇల్లు శుభ్రంగా పెట్టుకుని ఆరోగ్యంగా ఉండటం కోసం ఆ భయాన్ని మనలో పెట్టారు. బూజులు ఎప్పటికప్పుడు దులిపేసు కుంటే, అక్కడ దోమలు, పురుగులు వాటికోసం బల్లులు వచ్చే అవకాశం ఉండదు కదా. పొరపాటున బల్లి తినే పదార్థాల్లో పడితే అది తెలియక తినేసి ప్రాణాలమీదకు తెచ్చుకుంటామేమోనని, ఒకో చోట ఒక్కో ప్రమాదమని భయాన్ని పెట్టి, వాళ్లే దానిని పోగొట్టడానికి.. కంచి లో బల్లి ని ముట్టుకున్న వాళ్ళను చెప్పకుండా ముట్టుకొని.. స్నానం చేస్తే దోషం పోతుందని ప్రత్యామ్నాయం చెప్పారు. పెద్దలు చెప్పిన ప్రతి వాటి వెనుక ఒక కారణం రహస్యం ఉంటాయి. వాటిని కొట్టిపారేయడం కాదు వాటి వెనుక ఉన్న శాస్త్ర రహస్యం తెలుసుకుని అందుకు తగ్గట్టుగా అనుసరించాలి. అంతే కానీ నమ్మకం మూఢనమ్మకం గా మారి అందర్నీ ఇబ్బంది పెట్టకూడదు” సున్నితంగా మిత్రుడికి బోధ చేసాడు.

“ఈ విషయం ఇంత స్పష్టంగా చిన్నప్పుడెప్పుడూ చెప్పలేదు ఏంరా.. అప్పుడు అసలు నమ్మకం ఏర్పడి ఉండేది కాదు కదా.”
“ఓరి భడవా! అదీ నాకే పెట్టావూ. అప్పుడు నాకు మాత్రం ఇదంతా చెప్పే తెలివి ఎలా ఉంటుంది రా చిన్న వాడినేగా నేనూను”
అంతా ఆనందంగా నిశ్చింతగా నవ్వుకున్నారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!