ప్రకృతి పరిరక్షణ

ప్రకృతి పరిరక్షణ

రచన: సావిత్రి కోవూరు 

ప్రకృతి సహజవనరులను పరిహాసము చేసి,
హరితము నంతా కలితము చేసి,

జలముల నన్ని పాతర వేసి గుట్టలనన్ని పిండిగా చేసి,

పాతాళము వరకు భువిని బీటలు  చేసి, జలములనన్ని పీల్చివేయగ,

చెరువులు కొలనులు కలుషితమవ్వగ, భూతాపమును మరింత పెంచి,

తరులు, గిరులా ఉనికే లేక, పంట భూములు పలాయనమవ్వగ

‘కాంక్రీటు జంగిల్’ కాలుమోపగ, హిమములన్నీ శిలలై పోగా,

చెరువులు ,కొలనులు కలుషిత కాసారములవ్వగ, జలముల అన్ని కాలకూటంబు లవ్వగా,

ఎప్పుడెరుగని రుగ్మతలకు దారులు వేయగ, మానవుని మనుగడ ప్రశ్నార్థంబవ్వగ,

పంట భూములు పలాయనమవ్వగ, గొంతు తడుపుటకు గుక్కెడు నీళ్ళే కరువై,

కలుషిత గాలితో ఊపిరితిత్తులు చిల్లులు పడగా, ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై,

పాలు పండ్లు కల్తీ అవ్వగ, పిల్లల ప్రాణాలు గాలిలో కలువగ

కనివిని రోగాలెన్నో, సుడిగుండంలా చుట్టుముట్టగా,
నడి వయసులోనే నడుములు వంగి, ముదిమి తనము ముందే వస్తే, దిక్కులు చూస్తూ మౌనంగా ఉంటే,

కాచుకున్న కాలుని పాశం కార్చిచ్చులా కబళిస్తుంటే, కళ్ళు మూసుకుని జపము చేస్తే, కాలూనిన భూమి కదులుతు ఉంటే,

దిక్కులు పిక్కటిల్లేలా అరచిన గాని, ఆసర ఇచ్చు కరములు కరువు, ఆయువు పోసే దేవుడు ఉండడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!