వారి బాల్యాన్ని వారికి ఇచ్చేద్దాం

వారి బాల్యాన్ని వారికి ఇచ్చేద్దాం

రచన: నాగ రమేష్ మట్టపర్తి

నాల్గవ ఏట రాకుండానే…
చేర్చేస్తారు ” నర్సరీ ”  లో…..
ఐదవ తరగతి పూర్తవ్వగానే…
వేసేస్తారు  ” రెసిడెన్షియల్ ”  లో…..

అసలేమీ ఆలోచించరు…..
ఎంత వేదనుందో పిల్లవాడి  ” హృదిలో “…..
ఏమీ పట్టదు మీకు…
ఏ లక్ష్యం ఉందో వాడి  ” మదిలో “…..

అంటారు సదా…
ఉన్నత చదువే  ” లక్ష్యం “…..
భావిస్తారు కదా…
పెద్ద హోదా ఉద్యోగమే  ” జీవితం “…..

తీరా వాడు వృద్ధాప్యంలో మిమ్మల్ని…
” వృద్ధాశ్రమానికి ”  పంపిస్తే రోదిస్తారా…..!?

మీరు దూరం చేసారు బాల్యంలో…
బిడ్డలకు మీ  ” ప్రేమాభిమానాలు “…..
అందుకే దూరమయ్యాయి వృద్ధాప్యంలో…
మీ బిడ్డల  ” ఆదరాభిమానాలు “…..

ముందు మీరు  ” మారండి “…
అది చూసి మీ పిల్లలు
వారంతటవారే  ” మారతారు “…..

బాలల దినోత్సవ శుభాకాంక్షలతో…..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!