సొగసు చూడతరమా..!

సొగసు చూడతరమా..!
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: పిల్లి.హజరత్తయ్య

శ్రీరాముని సౌందర్య శోభ
సూర్యని తేజస్సులా
రత్నదీపంగా భాసిస్తున్నది..!
ఆయన ముఖ  సౌశీల్యత
వికసించిన మకరందములా
స్నిగ్ధ మోహనంగా కనిపిస్తున్నది..!
ఆయన యౌవనశోభ
దేవలోక ఇంద్రునిలా
చకితులను చేస్తున్నది..!
అయన అధరాలు
ఎరుపుతో నిండిన పండులా
సంభ్రమం కలిగిస్తున్నవి..!
ఆయన వక్షస్థలం
నిగనిగలాడే నీలశ్యామములా
దేదీప్యమానంగా వెలుగొందుతున్నది..!
ఆయన ముంగురులు
అల్లుకున్న లతలా
ముగ్ధమనోహరమై ఆకర్షిస్తున్నవి..!
ఆయన పాదాలు
అభయమిచ్చే దివ్యహస్తాలై
ఆరాధనకు పురుగొల్పుతున్నది..!
ఆయన సొగసు చూడతరమాన్నట్లు
అందరి హృదయాలను కొల్లగొట్టేలా
సకల సుగుణాలతో శోభిల్లుతున్నది..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!