ఎండమావిలో నీటి చెమ్మ

ఎండమావిలో నీటి చెమ్మ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: గాజులనరసింహ

నేటి తరాల తడబాటులో
పొరబాటున ఉద్భవించిన రేపటి తరం
హతలాకుతలమౌతున్నా లోకంలో బలిపశువులు
నియంత్రణ లేని నిర్భాగ్యులు
అస్వస్థతలో కాలిపోయే ఒత్తులు
ఇక ఏముంది లోకాన జీవనాధారం
అంతా.. కృత్రిమాధారం కుటీలత సారం..
సద్దుమణగని ఆందోళనం
అంతుపట్టని అయ్యోమయం
అవకాశ ఊబుల్లో ఉక్కిరి బిక్కిరి …
నిరాశ నెలవుల్లో… వేదనసారం పాడిన గీతం
తప్పని బ్రహ్మం చెప్పిన కాలజ్ఞానం
కాలనాగుల చెరలో విశ్వము విషాధకారం
ఆచారం తప్పిన విషాదాచారాలు
గతంను నివృత్తి చేసుకోవడం తప్ప భవిష్యత్తు ఏమీలేదు.
నానాటికి పెరుగుతున్న అంధకారం
నింగిటంచులను చేరింది
ఇక రేపటి తరం ఏమి చూరగొంటుందో..ఏమి సాధించబోతుందో..
పునాదులు కదిలించే పుణ్యమూర్తులే నేడు అధికం
సంస్కారం నేర్పని చదువులు నెత్తికెక్కాయి
మర్యాదలేని మనుషులు కుక్కలై మొరుగుతున్నాయి ..
అడుగడుగునా భయాందోళనలె
వారెవ్వా..ఏం బతుకో.. భయపడుతూ బతికే..బతుకు..
తలుచుకుంటేనే..గుండె నీరై పోతుంది …

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!