నీడ

(అంశం::” సస్పెన్స్/హార్రర్/థ్రిల్లర్ “)

నీడ

రచయిత :: అలేఖ్య రవికాంతి

‘ట్రింగ్… ట్రింగ్’ అని ఫోన్ రింగవడంతో బద్దకంగా నిదురలేచి ఫోన్ ఎత్తింది మీరా.

హలో ! …ఎవరండి? ఇంత పొద్దున్నే చేసి మంచి నిద్రని డిస్టర్బ్ చేసారు అంది..
ఒసేయ్ మీరా, నేనే శశిని. ఇది మా నాన్న నెంబర్.నా ఫోన్ లో చార్జింగ్ అయిపోయింది అందుకే నాన్న ఫోన్ నుండి చేసాను అంది.

ఓ నువ్వా.. , సరే చెప్పు విషయం ఎంటో అంది గునుగుతూ.

మరిచిపోయావా..? ! రేపే పెయింటింగ్ సబ్మిట్ చేసే ఆఖరు తేది. మన స్కూల్ పిల్లల తరుపు నుండి నువ్వేగా పెయింటింగ్స్ సబ్మిట్ చేసేది. ఇంతకి నీ పెయింటింగ్ పని పూర్తి అయ్యీందా, లేదా? అంది ఆందోళనగా.

అయ్యో..! మరిచిపోయానే. ఇప్పుడే లేచి కాస్త ఫ్రేష్ అయ్యి మొదలెడతా అంది ఫోన్ కట్ చేస్తూ.

ఇక నిమిషం ఆలస్యం చేయకుండా వెంటనే లేచి ఫ్రెష్ అయ్యి ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టుకుని సిప్ చేస్తూ ఆలోచించసాగింది ఎలాంటి ఆర్ట్ వేయాలా అని.

“వావ్ సూపర్బ్ ఐడియా”, ! అంటూ కళ్ళు తెరచి పెయింటింగ్ కి కావలసినవన్నీ అరేంజ్ చేసుకుని మెల్లగా బొమ్మ గీయడం మొదలెట్టింది.

అలా వేస్తూ పోతూంది. తనకి సమయమే తెలియడం లేదు. ఇంతలో గడియారం గంట కొట్టింది.

చట్టుకున తన కళ్ళు గడియారం వైపు చూసాయి.
అమ్మో అప్పుడే ఒంటి గంటైందా…

సరే, ముందు ఎదోటి చేసుకుని తినేసి మళ్లీ పేయింటింగ్ మొదలెట్టాలి. ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది పెయింటింగ్ పూర్తవడానకి అనుకుంటూ లేచి చకచక నూడిల్స్ వండేసుకుని తినేసి తిరిగి మళ్లీ పెయింటింగ్ వేయడం మొదలెట్టింది. ఎందుకో తనకు కళ్ళు మూతలు పడుతున్నాయి చాలా.

అబ్బా! ఎంటి ఇవాళ బాగా నిదురొస్తుంది. సరేలే ఓ గంట సేపు పడుకుని లేద్దాం అనుకుని అలానే పడుకుని గాఢ నిద్రలోకి జారుకుంది.

ఉన్నట్టుండి ఉరుముల శబ్దాలు వినబడేసరికి టక్కున లేచి గడియారం వైపు చూసింది సమయం ఏడు కావొస్తుంది.

‘అయ్యో, ఇంతసేపు ఎలా పడుకున్నాను’ ? అనుకుంటూ చకచక లేచి కప్పు కాఫీ తాగేసి తిరిగి పెయింటింగ్ వేయడంలో నిమగ్నమయ్యింది.

కాసేపటికి పెయింటింగ్ పూర్తయ్యింది. అది ఒక ఆరు సంవత్సరాల అమ్మాయి బొమ్మ. చిమ్మచీకట్లో బిక్కమొహం వేసుకుని తల్లి కోసం ఎదురు చూస్తూ నిలిచుని ఉంది.

అబ్బా, బొమ్మ ఎంత బాగా వచ్చిందో !! కానీ ఎదో వెలతిగా ఉంది. ఎంటబ్బా అది అని ఆలోచిస్తుంది.

ఈలోగా బయట పిడుగుల శబ్దం 1000 వాలా టపాకాయల్లా పేలుతున్నాయి. కుండపోతుగా వర్షం కురుస్తూనే ఉంది.

అబ్బా…, ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో అంటూ గడియారం వైపు చూసింది. అప్పుడు సమయం సరిగ్గా పదకొండు.

అబ్బో, చాలా సమయమే పట్టింది అనుకుంటూ పెయింటింగ్ కి చివరి మెరుగులు దిద్దింది. చివరగా ఆ అమ్మాయి బొమ్మ పక్కనే.. “అమ్మ రా” అని రాసింది..
హామ్.. అబ్బా, పెయింటింగ్ అద్భుతంగా వచ్చింది. కచ్చితంగా ఫ్రైజ్ వస్తుంది అనుకుని వంటింట్లోకి వెళదాం అనుకునేలోగా సడన్ గా కరెంట్ పోయింది.

ఇదేంటి, ఈ టైమ్ లో కరెంట్ పోయింది!. కాండిల్ ఎక్కడుందబ్బా అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా తన చేతికి ఎదో తగిలినట్టు అనిపించింది. అది కాండిల్.

ఇదేంటి కాండిల్ ఇంత దగ్గరగా ఉంది. సరేలే అనుకుంటూ దీపం వెలిగించింది. ఒక్కసారిగా పెయింటింగ్ వైపు చూసేసరికి దడుచుకుంది. ముచ్చమటలు పట్టసాగాయి మీరాకి.

ఇదేంటి పెయింటింగ్ పై ఈ నీడ ఎవరిది? అంటూ వెనకకు తిరిగి చూసింది. అక్కడ ఎవరూ లేరు. సరే అది ఎదో వస్తువు నీడ కావచ్చు అనుకుని ముందుకి తిరిగింది. మళ్ళీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

“ఆ నీడే, చేయి చాపుతూ, బిడ్డ అమ్మనొచ్చానమ్మా, ఇటు రా”, అంటూ ఓ ఆడ స్వరం వినిపించింది.

మీరా గుండె వేగం పెరిగింది. ముచ్చమటలతో తన తనువంతా తడిసిపోయింది.

”ఏయ్ ఎవరు నీవు, నీకేం కావాలి” అంది వణుకుతూ.

ఎంటమ్మా అలా అంటావు..?.
నువ్వేగా ‘అమ్మ రా’ అంటూ నన్ను పిలిచావు. అందుకే వచ్చేసా అంది ఆ నీడ.

ఏంటి నేను పిలిచానా? ఎప్పుడు…!? అంది అయోమయంగా మీరా.

“అదిగో ఆ పెయిటింగ్ లో అమ్మ రా” అని రాసావుగా అంది ఆ స్వరం నవ్వుతూ.

ఆ మాట వినేసరికి మీరా బిత్తరపోయింది! .

ఆ నీడ తన వైపు రావడం గమనించింది. వెంటనే అక్కడి నుండి పరిగెత్తి ఓ మూలన కూర్చుంది. ఇంతలో కాండిల్ ని పట్టుకుని ఆ నీడ తననే అనుసరిస్తూ వస్తుంది.

ఏయ్, నా దగ్గరకు రాకు, వెళ్ళిపో అంటూ కళ్ళను గట్టిగా మూసుకుంది.

కాసేపటికి చల్లని గాలి తన మేనిని తాకడం చూసి కళ్ళను తెరిచింది. ఇళ్ళంతా వెలుతురు. కరెంటు వచ్చింది కాబోలు అనుకుంటూ భయంభయంగా పెయింటింగ్ వద్దకు నడిచింది..

అక్కడ ఏ నీడ లేదు. చుట్టూత ప్రశాంతమైన వాతావరణం ఎప్పటిలానే.

ఇదేంటి అంతా మామూలుగానే ఉంది. అంటే ఇంతసేపు నేను చూసింది కలనా? లేక నా భ్రమనా అంటూ ఆలోచించసాగింది.

అప్పుడే ‘టిక్ …టిక్ ‘ అని తలుపు చప్పుడు అవ్వడంతో తనలో మళ్లీ భయం మొదలైంది. అప్పుడు సమయం సరిగ్గా పన్నెండు కావొస్తుంది.

ఈ సమయంలో ఎవరు తలుపు కొడుతున్నారూ? అంటూ కిటికీ నుంచి చూసింది.
బయట ఎవరూ లేరే.. ! అనుకుంది.

ఈలోగా మళ్లీ తలుపు చప్పుడు వినిపించింది. మీరాలో వణుకు మొదలైంది. ఆంజనేయ దండకం చదువుతూ మెల్లగా తలుపు తెరిచింది. అప్పుడే కరెంట్ పోయింది.

ఆ చీకటి గదిలో ఉన్నట్టుండి ‘నిను వీడని నీడని నేనే’ అంటు టీవీలో సాంగ్ ప్లే అవుతుంది..
ఒక్క క్షణం మీరా గుండె ఆగిపోయినంత పనైంది.

‘ఏంటి బిడ్డ నన్ను లొపలికి రమ్మనవా’ అంటూ తిరిగి ఆ ఆడ స్వరం వినిపించింది..

మీరా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. ఆ భయంకరమైన నీడే గుమ్మం ముందు నీలబడింది..

అయ్య బాబోయ్దె… దెయ్యం, దెయ్యం అంటూ మీరా లోపలికి పరిగెత్తింది. ఆ అరుపులకి తన గొంతు తడి ఆరిపోయింది. శరీరమంతా చమటలు పట్టేసాయి. మీరాకి అరవడానికి కూడా ఓపిక లేదు. గొంతు తడారిపోయింది. నెమ్మదిగా ఫ్రిజ్ ని తెరిచింది. అందులోనూ ఆ నీడే పలకరించింది మరల.. ‘నీళ్లు కావాలా బిడ్డా’… అని .

ఆవ్, అంటూ ఉలిక్కిపడింది మీరా ఒక్కసారిగా. అయ్యో దేవుడా! అసలు ఈ నీడ నన్ను ఎందుకు వెంటాడుతోంది అంటూ గుమ్మం వైపు పరుగులు పెట్టింది. తను గుమ్మం వద్దకు రాగానే ఉన్నపలంగా తలుపులు మూసుకున్నాయి..

ఎవరైనా ఉన్నారా… ? నన్ను కాపాడండి అంటూ తలుపులు బాదుతూ ఏడవసాగింది.

ఎందుకు బిడ్డ అట్ల ఏడుస్తున్నావు. ఇదిగో ఈ నీళ్లు తాగు. గొంతెండుక పోయింది మొత్తం అంటూ గాల్లో ఓ నీళ్ళ గ్లాస్ పంపిస్తూ అంది ఆ నీడ.

అసలు నువ్వెవరు? ఎందుకు నన్ను భయపెడుతూ వెంటాడుతున్నావు అంది ఏడుస్తూ మీరా.

అదేంటి బిడ్డ అట్లంటావు. నువ్వే కదా అమ్మ రా అంటూ పిలిచావు. ఇంత చీకట్లో ఓ ఆడ కూతురు ఒంటరిగా ఉంటే ఎట్లా రాకుండా ఉంటా చెప్పు? .నా బిడ్డకి జరిగినట్టే నీకు అన్యాయం జరిగితే ఎట్టా అంది ఆ నీడ ఎడుస్తూ.

నీడ మాటలు వింతగా అనిపించాయి మీరాకు…

నీకు బిడ్డుందా? ఏమైంది తనకి ? అసలు నువ్వు నా దగ్గరికి ఎలా వచ్చావు అంది అయోమయంగా.

నేనా, అదిగో ఆ పెయింటింగ్ లో “అమ్మ రా” అని రాసావుగా అందుకే వచ్చా అంది ఆ స్వరం నవ్వుతూ…

అది పెయింటింగ్ కదా !?.మరి నువ్వు నిజంగా ఎలా వచ్చావు అంది మీరా భయంగా..

“అమ్మ, ఎవరికైనా అమ్మేగా బిడ్డ” .
నా బిడ్డ చిన్నతనంలో ఎవరో ఆగంతకుల చేతుల్లో బలైంది. ఓ చీకటి రాత్రి దాన్ని చెరిచి చంపేసారు. నా బిడ్డ అప్పుడు మస్తూగా ఎడ్చే ఉంటది నా కోసం.నేను నా బిడ్డ ఆలోచనలతోనే ఆత్మహత్య చేసుకున్న. అందుకే నేను కూడా సచ్చి ఇలా ఆత్మలా మారా.. “ఏ బిడ్డ అయిన చీకటిలో ఆర్తిగా అమ్మ రా” అని పిలిస్తే ఇలా నీడలా మారి వస్తా అంది ఎడుస్తూ.

మీరాకి ఆ నీడ పై భయం పోయి జాలి కలిగింది.. అయ్యో ఎడవకు అమ్మ! నీ బిడ్డని చంపిన వాళ్ళని వదిలేసావా? అంది బాధగా..

నేను మనిషిగా ఉన్నప్పుడు నా బిడ్డకు న్యాయం జరగాలని కోర్టుల చుట్టూ తిరిగినా అన్యాయమే గెలిచింది. అందుకే సచ్చి ఆత్మగా మారి ఆ దుర్మార్గుల అంతు చూడాలని ఎదురు చూస్తున్నాను. ఆ సమయం ఎప్పటికైనా రాకపోదూ అంది ఎడుస్తూ.

అయ్యో…, బాధపడకమ్మా. మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. నీకు నా వంతు సహయం కావాలంటే తప్పకుండా చేస్తాను. ముందు ఆ దుర్మార్గుల అంతం చూడమ్మ అంటూ కోపంతో పక్కనే ఉన్న గ్లాస్ ను విసిరిగొట్టింది.

******

” ఓసేయ్ మీరా, ఏంటే మిట్ట మధ్యాహ్నం ఈ కలవరింతలు, పెడబొబ్బులు” అంటూ మీరా దుప్పటిని తీసి తన తల్లి ఒక్కటి మొట్టికాయ మొట్టేసరికి తిరిగి మీరా ఈ లోకంలోకి వచ్చింది.

‘అమ్మ, నువ్వేంటి ఇక్కడ? ఆ నీడ ఏది’? అంటూ కుతూహలంగా అడిగింది..

నీడా, పాడా! నీ అరుపులతో నాకు పిచ్చెకిందనుకో. అందుకే మిట్ట మధ్యాహ్నం పడుకోవద్దు, ఆ దయ్యాల సినిమాలు చూడద్దనేది. కర్మరా బాబు అంటూ నసుగుతూ మీరా తల్లి కిందికి వెళ్లిపోయింది..

ఓ ఇదంతా కల… !! అంటూ బుర్ర గోకుంటూ లేచింది మీరా.

నిజంగా ఆత్మలు, దెయ్యాలు ఉన్నాయా అంటే..!
మనం బాగా భయపడిన సంఘటనలు, భయంకరమైన ఆలోచనలే మన మెదడు పొరల్లో ముద్రించబడతాయి. అవే మన నిదురలో స్వప్నాల్లా వస్తాయి… నిజంగా దెయ్యం ఉందా లేదా అనేది మాత్రం చూడని వారికి ప్రశ్నార్థకం? అనుభవం అయిన వారికి సమాధానం!!

*సమాప్తం*

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!