అమ్మో బొమ్మ!

(అంశం::” సస్పెన్స్/హార్రర్/థ్రిల్లర్ “)

 అమ్మో బొమ్మ!

రచయిత :: ఎన్.ధనలక్ష్మీ

“ఏవండీ ఎక్కడ ఉన్నారు అండి? అసలే వానలు పడే సూచనలు ఉన్నాయి అంటా న్యూస్ చానల్స్ చూపిస్తున్నారు..అబ్బా గౌతమి నేను వచ్చేస్తానులే నువ్వు కంగారు పడకు అని ఫోన్ కట్ చేశాడు గౌతం.
తన భార్యకి నచ్చిన స్వీట్స్,అడిగినా సామానులు కొన్ని తీసుకొని ఇంటికి బయలుదేరాడు..దారిలో ఉన్నట్టుండి వర్షం మొదలు అయింది… బైక్ ని  అపి దగ్గరలో ఉన్న రేకుల షడ్ లోకి , తన సామానుల కవర్ ను తీసుకొని వెళ్ళాడు . వెళ్లినా కొద్దీ సేపు అయిన తరువాత ఇంకా ఇద్దరూ, ముగ్గురు అక్కడికి వచ్చి చేరారు తనలాగే తడవకుండా ఉండడం కోసం..
ఒక అరగంట తరువాత వర్షం తగ్గడంతో అక్కడ నుంచి అందరూ తిరుగు ప్రయాణం అయ్యారు..గౌతంకి తెలియని విషయం ఏమిటి అంటే తన కవర్స్ మారిపోయాయి! ఇంటికి చేరుకున్నారు..
” నేను చెపుతూనే ఉన్న త్వరగా రండి అంటే విన్నారు కాదు ఇప్పుడు చూడండి ఎలా తడిచి పోయారో. మీ ఏజ్ కి ఇలా తడవడం అవసరమా.
అసలే మీకు సైనస్ ప్రాబ్లెమ్ ఉంది అది ఎలా మరిచిపోయారు మీరు.నేను ఇంత సేపు గొంతు చించుకొని అరుస్తుంటే మీరు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు?”
నన్ను ఎక్కడ మాట్లాడినించావు అందులోను నువ్వు కోపంగా ఉన్నావు..నిజం చెప్పనా గౌతమి నువ్వు కోపంలో కూడా ముద్దుగా ఉన్నావు.
ఊరుకోండి గౌతం మీరు మరీను అని సిగ్గుపడుతూ
షష్టిపూర్తి  చేసుకునే వయసుకి వచ్చిన మీలో చిలిపిదనం పోలేదు..
మీరు స్నానం చేసి రండి మనం భోజనం చేద్దాము..
అలాగే అంటు తను వెళ్లిపోయిన తరువాత తను కవర్స్ ఓపెన్ చేసి చూసింది.కూరగాయలు అన్నిటినీ తీసి సెపరేట్ చేసింది ..ఇంకో కవర్లో ఏమి ఉందో చూద్దాము అని ఓపెన్ చేసి చూసింది.గిఫ్ట్ ప్యాక్ ఉంది.

ఏంటో ఈయన ఇంత వయసు వచ్చిన ఇలా సర్ప్రైజ్ చేస్తుంటారు అని మనసులో అనుకుంటూ కవర్ ఓపెన్ చేసి చూసింది.అందులో అందమైన డోరమెన్ బొమ్మ ఉంది. ముద్దుగా కూడా ఉంది
థాంక్స్ అండి మీ సర్ప్రైజ్ బాగా ఉంది…
నేను ఏమి తెచ్చాను నీ కోసం..ఇదిగో చూడండి అని బొమ్మను చూపించింది…
గౌతం మనసులో ఇప్పుడు తీసుకురాలేదు అంటే నా మీద ప్రేమ తగ్గిపోయింది అని గొడవ వేసుకుంటుంది..
హా నీకు సర్ప్రైజ్ చేయాలి అనుకుంటే నువ్వు చూసావా.పోనీలే నీకు నచ్చిందా కదా అది చాలు(పాపం ఎవరిదో ఈ బొమ్మ)…
అర్ధరాత్రి సడన్ గా ఏడుపు వినపడింది ..గౌతమి కి మెళుకువ వచ్చి బయటకు చూసింది కాని ఎక్కడ ఎవరు కనపడలేదు..సడెన్ గా బొమ్మ వైపు చూసి గట్టిగ కేక పెట్టింది దెబ్బకి నిద్ర మత్తు వదిలి పైకి లేచి బయటకు వచ్చాడు గౌతం..
గౌతమి షాక్ తో బిగుసుకు పోయింది. తనీని కదిపితే ఏవండీ బో…….బొమ్మ ఏడుస్తుంది అండి కంట్లో నుండి నీళ్లు వస్తున్నాయి అండి అంది కంగారు పడుతూ…
హే గౌతమి ఏమి లేదు అక్కడ,నువ్వు చీకటిలో అందులో నిద్రలోంచి వచ్చి చూశావుగా నీకు అలా అనిపించి ఉంటుంది ..ఒక సారి అటు చూడు ఏమి లేదు అక్కడ.
తను చూస్తుంది బొమ్మ ఏమి ఏడవడం లేదు…
నవ్వుతూ ఉన్నటే ఉంది..
అది కాదండి నేను విన్న,చూసాను కూడా బొమ్మ ఏడవడం…గౌతమి అది నీ భ్రమ అయి ఉంటుంది ..పదా నిద్ర పొదము అసలే రేపు నాకు ఆఫీస్ రూంలో వర్క్ ఉంది.
వాళ్ళు వెళ్ళగానే బొమ్మ కంట్లో నుండి నీళ్లు వచ్చాయీ..
తరువాత రోజు గౌతం ఇంట్లో ఫైల్స్ చూస్తున్నారు.
ఇంతలో తనకి ఎక్కిలు స్టార్ట్ అయ్యాయి. గౌతమి వాటర్ అని అడిగారు చేతికి ఇచ్చారు తీసుకొని లోపల బెడ్ రూంలో టెండర్ ఫైల్ ఉంది తీసుకొని రా అన్నాడు తల ఎత్తుకోకుండానే..
ఫైల్ చూడడం అవ్వడంతో ఇంకా ఎంత సేపు వెయిట్ చేయాలి అని తల ఎత్తి చూసి షాక్ అవుతాడు..గౌతమి బట్టలు తీసుకొని వస్తూ ఉంటుంది…
ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు అండి…
అది గౌతమి నాకు ఎక్కీలు వస్తె వాటర్ ఇచ్చావు కదా!
నేనా!ఎప్పుడు అండి???? మీకు చెప్పే కదా నేను మిద్ది పైకి వెళ్లాను. అయిన మీరు పనిలో పడితే నన్ను ఎక్కడ పట్టించుకుంటారు అనుకుంటూ తన బెడ్ రూంకి వెళ్లిపోయింది …
అది ఏంటి! తను పైనుంచి వస్తే నాకు వాటర్ ఎవ్వరూ ఇచ్చారు మరి..ఫోన్ రావడంతో ఆలోచనల నుండి బయటకి వచ్చి ఆఫీసుకి వెళ్ళిపోయారు..
పని ముగించుకొని ఇంటికి వెళ్లగానే ఇంటికి లాక్ వేసి ఉంది..తన దగ్గర ఉన్న తాళంతో వేసి ఉంది.
లాక్ ఓపెన్ చేసి ఏమి ఉంది అని ఓపెన్ చేసి ఫ్రెష్ అయి వచ్చాడు..తనకి  తల నొప్పిగా ఉండడంతో కాఫీ పెట్టుకుందాము అని లోపలికి వెళ్ళి కాఫీ తయారు చేసి గ్లాస్ లో  పోసుకొని  ఫోన్  వస్తే  గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోయి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉండి పోయాడు. ఇంతలో గౌతమి వచ్చి అబ్బో కొంచం ముందుగా వస్తే మా ఆయన చేతి కాఫీ తాగే అదృష్టం దక్కేది నాకు నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది.
అమ్మ ! గ్యాస్ ఆన్ అయి ఉంది వెంటనే ఆఫ్ చేసి కిటికీ తీయండి అని..
తను  కంగారు పడుతూ అలాగే చేసింది ..ఇంతకీ ఎవరు చెప్పారు అని హల్ లోకి వచ్చి చూసింది ఎవరు లేరు అక్కడ…ఇప్పుడు కంగారు స్థానంలో భయం మొదలై గట్టిగ అరిచింది..
ఫోన్ మాట్లాడతున్న గౌతం షాక్ అయి వెంటనే పరుగుఅందుకొని భార్య దగ్గరకి వచ్చాడు .
ఏవండీ మన ఇంట్లో  దెయ్యం ఉంది అండి..
భయపడుతు అసలు విషయం చెప్పింది!
నువ్వు చెప్పింది నిజమే మొన్న ఇలాగే నాకు కూడా జరిగింది.ఎక్కిళ్ళు వస్తే ఇలాగే మంచి నీరు అందించింది..నిజం చెప్పాలి అంటే మనల్ని కాపాడింది.
ఏవండీ దయ్యాలు అంటే మనల్ని బాధ పెట్టాలి గాని
ఇలా కూడా కాపాడుతాయ !!!!
యాదృచ్ఛికమో లేదా మన భ్రమ ఏమో అర్థం కావడం లేదండి!! సడెన్ గా గాలి ఎక్కువ విచాసాగింది. కిటికీలు తలుపులు వాటికి అవ్వే  కొట్టుకో సాగాయి..వాళ్లిద్దరికీ గుండెల్లో దడ మొదలై భయంతో ఇద్దరు బిగుసుకుపోయారు..
ఇంతలో డోరేమాన్ బొమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చింది… అమ్మో బొమ్మ అండి వస్తూ ఉంది మన దగ్గరకి…
ఆ బొమ్మ మాట్లాడసాగింది” అమ్మ మీరు ఇద్దరు భయపడకండి ..ఫస్ట్ నింపాదిగా కూర్చోండి..
వాళ్ళిద్దరూ అయోమయం చూస్తూ అలాగే చేశారు…
అమ్మ మీరు ఈ మంచి నీళ్లు తాగండి అయ్య
మీరు కూడా అని అంది…
వాళ్ళిద్దరూ భయపడుతూనే అలాగే చేశారు …
” అమ్మ , అయ్యా మిమ్మల్ని నేను ఏమి చేయను  భయపడకండి ”
గౌతం అసలు ఎవరు నువ్వు ??ఎలా బొమ్మలోకి వచ్చావు !!
” నా పేరు వంశీ నేను ఒక చిన్న ఫ్యాక్టరిలో సాధారణ కూలీని..నాకంటూ ఎవరు లేరు పరిచయం అయినా వసంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న…తనకు కూడా ఎవరు లేరు..మా ఇద్దరి ప్రేమకి గుర్తుగా మాకు ఓ పాప పుట్టింది.తనకి శ్రావిక అని పేరు పెట్టుకున్నాo. శ్రావి రాకతో మా జీవితం ఆనందమయం అయింది..
తను చేసే అల్లరిని చూస్తూ ఎంతో  మురిసి పోయే వాళ్ళం. అనాధల మైన మాకంటూ ఓ కుటుంబం ఏర్పడింది”..
మరి నువ్వు ఎలా చనిపోయావు…
మనం అనుకున్నట్టు జీవితం ఎందుకు ఉంటుంది అమ్మ!
ప్రతి ఆదివారం నా కుటుంబంతో నేను సరదాగా
పార్క్ కి,సినిమాలకి వెళ్తూ ఉంటాము.. అల ఓ ఆదివారం మేమంతా సరదాగా గడిపి వస్తుండగా శ్రావికి షాపులో ఉన్న డోరేమాన్  బొమ్మని చూసి ఇష్టపడింది..ఆ టైమ్ కి నా చేతిలో డబ్బులు లేక
తీసిఇవ్వలేకపోయాను.. శాలరీ వచ్చిన తర్వాత తీసిస్తానని పాపకు మాట ఇచ్చాను.
అనుకున్నట్టుగానే శాలరీ చేతికి రాగానే  బొమ్మను అందంగా ప్యాక్ చేపించి తీసుకుని బయలుదేరాను.. ఉన్నట్టుండి వర్షం మొదలైంది.సైకిల్  సైడ్ లో అపి  రేకుల షడ్ దగ్గరకి వెళ్ళాను అక్కడికీ వెళ్లి చూస్తే ఎవరో కాలేజ్  కుర్రాళ్ళు అమ్మాయిని పాడు చేయాలని చూస్తున్నారు. మొత్తం నలుగురు అబ్బాయిలు ఉన్నారు పైగా తాగేసి ఉన్నారు…
వెంటనే నేను నాకు దగ్గరలో కనపడిన కర్రను తీసుకొని వాళ్ళని కొడుతూ ఆ అమ్మాయీని పారిపోమని చెప్పాను.వాళ్లను ఆ అమ్మాయి వెనుక పడకుండా నా శక్తి మేర ఆపాను..ఇంతలో ఒక్కడు నా తలపై కొట్టారు… వాళ్లంతా నన్ను ఇష్టమొచ్చినట్టు కొట్టారు… ప్రాధేయపడ్డా వదిలేయండి నన్ను మీరు  తప్పు చేస్తేనే కదా నేను మిమ్మల్ని కొట్టింది .  డిస్టర్బ్ చేసిందే కాక మళ్ళీ మాకు నీతులు చెప్తావా నిన్ను ఇలా కాదు అంటు రాడ్ తీసుకొని కొట్టారు.
నన్ను తీసుకొని రోడ్ పై పడేసి వెళ్ళిపోయారు..
నాకు ప్యాక్ చేసి ఉన్న గిఫ్ట్ కనపడింది …నేను లేకపోతే నా కుటుంబం ఏమి అయిపోతుంది.కష్టపడి లేచి వెళ్ళడానికి ప్రయత్నించా వాళ్ళు తిరిగి వచ్చి నన్ను లారీలు వెళ్ళే చోటా పడేశారు..ఆ కుండబోత వర్షంలో నా మీద నుంచి దాదాపు ఒక్కటీ కాదు నాలుగు లారీలు వెళ్ళాయి… అలా ఆ నా ప్రాణం నా నుండి వేరు అయింది…నా శరీరం నుండి నా ఆత్మ వేరు అయింది..నా బిడ్డకు ఇష్టమైన ఈ డోరామెన్ లోకి చేరాను..ఎవరో బొమ్మలు అమ్మే అతను పడి ఉన్న గిఫ్ట్ ప్యాక్ ని తీసుకొని తన షాపులో అమ్మకానికి పెట్టాడు..కవర్లు మారిపోవడం వల్ల నేను మీ దగ్గరకి చేరాను…
నేను వస్తాను ,తనకి బొమ్మ తెస్తాను అన్న ఆశతో ఎదురుచూస్తున్నా నా భార్య పిల్లలకి నా శవం ఎదురు పడింది. నా భార్య బిడ్డ ఇప్పుడు కష్టాల కుడిమిలో కడుపు నింపుకోవడం కోసం ఇబ్బందులు పడుతున్నారు..నాది చిన్న విన్నపం దయచేసి ఈ బొమ్మను నా పాపకి చేరేలా చేయండి అయ్య… అది ఒక్కటీ నా తరుపున మీకు అభ్యర్థన…
అది విన్న గౌతమి,గౌతం వాళ్ళు చాలా బాధ పడ్డారు ..నన్ను క్షమించండి నా కథ చెప్పి మీకు బాధను కలిగించాను..
వంశీ నువ్వు కాపాడింది ఎవరినో కాదు మా కూతురిని.
అవునా అయ్య..ఇప్పుడు మీ అమ్మాయీ బాగా ఉందా!!! ఏమి చేస్తున్నారు.
గౌతమి గారు ఏడుస్తూ లేదు తను ఈ లోకం లేదు..
ఏమైంది????అమ్మ
వంశీ! మా అమ్మాయి కాలేజ్ నుండి ఇంటికి బయలుదేరేటప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడుతు రావడం తనకి అలవాటు. రోజు మాదిరి నాకు ఫోన్ చేసింది నాతో మాట్లాడుతూనే తన వెనుక ఎవరో బైక్ లో ఫాల్లో అవ్వడం గమనించి నాకు చెప్పింది నాకు లొకేషన్ కూడా షేర్ చేసింది .నేను వెంటనే బయలుదేరాను..
నువ్వు నా బిడ్డను వాళ్ళు కిడ్నాప్ నుండి తప్పించగానే తను అంతటి వర్షన్నీ కూడా లెక్క చేయకుండా  పరిగెత్తుతూ ఉంది రోడ్డుమీద..
నాకు కనపడగానే నాకు ప్రాణం లేచి వచ్చి తన దగ్గరికి  వెళ్ళి కార్ అపాను.తను మత్తుగా తులుతూ ఉంది.ఆ మత్తులోనే నీ గురించి చెప్పింది..వాళ్ళు తనకి డ్రగ్స్ ఇచ్చారు అని చెప్పింది. వెంటనే తనని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాను..కానీ ఆ దుర్మార్గులు ఇచ్చిన ఓవర్ డోస్ కారణంగా తను చనిపోయింది.
కేసు పెట్టాను అది ఇంకా నడుస్తూ ఉంది.  అది ఎవరు చేశారో ,వాళ్ళు అసలు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు పోలీసులు ఇంకా వెతుకుతూనే ఉన్నాడు…నా బిడ్డకు న్యాయం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నా అని చెప్పి
కన్నీటి పర్యంతం అవుతాడు గౌతం…
అతి కష్టం మీద మేము కొలుకున్నము..
మా బిడ్డ ఎప్పుడు చెప్పేది జీవితంలో ఏమి జరిగినా సరే మా పెదాలపై చిరునవ్వు చెరిగిపోకుండా చూసుకోమని చెప్పింది.అందుకే ఇలా ఉన్నాము…
అయ్యా ! ఒకప్పుడు చనిపోయిన తరువాత శిక్ష  అనుభవించేవారు కానీ ఇప్పుడు బతికి ఉండగానే అనుభవిస్తారు.. భగవంతుడు ఎవరినీ వదలుపెట్టడు..పోయిన జన్మలో ఎదో పాపం చేసి ఉంటా అందుకే నా కుటుంబానికి దూరమయ్యా…
బాధపడకు గౌతం..ఇంకా నుంచి నీ భార్య మా బిడ్డగా , నీ బిడ్డ మా మనవరాలిగా బ్రతుకుతారు.
ఏ లోటూ రాకుండా చూసుకుంటాను..
ఇది జాలి పడి చేయడం లేదు వంశీ.. నీ మంచి మనసుని మెచ్చి చేస్తున్న.. నీ స్వార్థం నువ్వు చూసుకోకా నీ ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ నా బిడ్డను కాపాడావు ..నువ్వు మా బిడ్డకి చేసిన సహాయం వల్లే నీ కుటుంబానికి దూరం అయ్యావు అని గౌతమి చెప్పింది.. నీ లాంటి గొప్ప వ్యక్తికి ఏమి ఇచ్చి ఋణం తీర్చుకోగలం అని చెప్పారు ఇద్దరు..
అనుకున్నట్టుగానే గౌతం వంశీ కుటుంబాన్ని ఇంటికి  తీసుకొని వచ్చాడు.. శ్రావీ బొమ్మని చూసి సంతోషంగా గుండెలకు హత్తుకుంది.. వంశీ కూడా చాలా సంతోషించాడు. గౌతం దంపతులు ఎంతో ప్రేమగా
చూసుకోసాగారు వారిని..
వంశీ కూడా తన భార్య,బిడ్డ ఇద్దరు సంతోషంగా ఉండడం చూసి ఇంకా వెళ్లిపోవాలి అనుకున్నాడు..
అమ్మ,  అయ్యా, ! నేను ఇంకా  ఇక్కడ  నేను ఉండలేను ..ఉండకూడదు కూడా. మీరు చేసిన  సహాయాన్ని జన్మ జన్మల గుర్తుపెట్టుకుంటాను..ఇంకా నాకు సెలవు అని  ప్రసన్నవదనంతో నిద్రపోతున్న తన భార్య, బిడ్డలను  ఒక సారి చూసుకొని వెళ్ళిపోయాడు…
వంశీ ఆత్మ ఆ దుర్మార్గుల కోసం వేట ప్రారంభించింది.
ఒకరోజు ఉన్నట్టుండి వర్షం మొదలైంది.. ఆ దుర్మార్గులు రోడ్డు మీద కార్ అపి మందు తాగుతున్నారు..అది చూసిన గౌతమ్ మీ వల్లే నేను నా కుటుంబానికి, ఆ తల్లిదండ్రులు బిడ్డను కోల్పోయారు.. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఇంకెంతో మంది కడుపు కోతకు కారణమవుతారు .తను కార్ లోపలకి వెళ్లి డ్రైవింగ్ చేస్తున్నాడు…వాళ్ళు భయంతో అరవసాగరు .వాళ్ళు చూస్తూ ఉండగానే  కార్ లోయలో పడ్డి ఆ నలుగురు చనిపోయారు .
వంశీ ఆత్మ నవ్వుతూ ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అనుకుంటు ఈ లోకం నుంచి వీడ్కోలు తీసుకున్నాడు…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!