ఎన్నో మరెన్నో

ఎన్నో మరెన్నో

రచన: బండి చందు

ఆ నవ్వు ఎన్ని బాధల్ని
తనలో ఇముడ్చుకుందో
ఆ చూపు ఎన్ని కన్నీళ్ళను దిగమింగిదో
ఆ ముడతలు మునుపెన్ని
కన్నులను ఆకర్షించాయో
ఆ చేతులు ఎందరి ఆకలి తీర్చాయో
ఆ చీర కట్టు ఎన్ని సాంప్రదాయాలను
ఆభరణాలుగా ధరించిందో
నెమలి కన్ను చూడలేని ఎన్ని
సాక్ష్యాలు ఆ కళ్ళు చూసాయో
మరవలేని గాయాల వెనుక
ఇంకిపోయిన జ్ఞాపకాలెన్నో
విడిపోని ఆ బంధాల చివరన
పెనవేసుకున్న భావాలెన్నో
నెరిసిన వెంట్రుకల వెనుక
నెమరేసుకున్న జ్ఞాపకాలెన్నో….

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!