(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే’)
సామాజిక సాఫల్యం
రచన: జీ వీ నాయుడు
గొర్రె కసాయినే నమ్ముతుంది
ఇది నానుడే కాదు యాధార్ధం కూడా
అంతరంగం ప్రశ్నిస్తే సర్దుకునేది
కాని ప్రశ్నించని అంతరంగం గొర్రెది
తప్పోప్పులను సరిచేసేదే అంతరంగం
ఆరేళ్ళ చిన్నారిని బలిగొన్న కామాంధుడు
తన అంతరంగం ప్రశ్నిస్తే అడ్డుకట్ట పడేది
నిండు నూరేళ్ల బంధానికి విడాకులు
కోపతాపాలే అందుకు దారిటీసే అంశాలు
కక్షలు కార్పణ్యాలు చెలరేగుతున్నాయి
బంధాలు బండ రాళ్ళవుతున్నాయి
అబద్దాల రాజ్యం లో నిజం బలాదూర్
పాలకుల్లో రగులుతున్న నిరంతర కక్షలు
నిండు గర్భిణీపై పోలీసుల దాష్టికం
వీటన్నిటికీ మూలం ప్రశ్నించని అంతరంగం
అంతరంగం ప్రశ్నించాలి అందరిని
అప్పుడే అంతో యింతో చేకూరుతుంది
సామాజిక సాఫల్యం సమైక్యంగా…
…………………