(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే’)
ప్రశ్నించు ఓసారి
రచన: కమల ముక్కు (కమల’శ్రీ’)
కష్టాలేమైనా నీ చుట్టాలా
ప్రతీ నిమిషం నిన్ను పలుకరిస్తూనే ఉంటాయి!
కన్నీళ్లే మైనా నీ స్నేహితులా
నిను వీడి పోనంటే పోనంటున్నాయి!
అపహాస్యాలేమైనా నీ బంధువులా
తగుదునమ్మా అని ప్రతీసారీ వచ్చేస్తాయి!!
నేనేం పాపం చేశానని
నాకీ సమస్యలంటూ ఏడుస్తావెందుకు!!
నీ కష్టాలకూ కన్నీటికీ నీ బాధలకూ
అన్నీటికీ నీ మౌనమే కారణం!!
మౌనమే అన్నిటికీ సమాధానమనుకుంటే
నీ జీవితం అంధకారమే!!
ఇకనైనా నిన్ను ప్రశ్నించే నీ అంతరంగాన్ని
అదిమిపెట్టడం ఆపేయ్యి!!!
నీ కన్నీటికీ కష్టాలకూ కారణమైన వారిని
ఓసారి గొంతెత్తి ప్రశ్నించు!!
నీ చుట్టూ ఉన్న వాళ్ల మాటలు కాక
నీలో మమేకమైన నీ అంతరంగం మాటలు విని
ప్రశ్నించడం మొదలుపెడితే
నీ సమస్యలన్నీటికీ పరిష్కారం దొరుకుతుంది!!!