నిర్ణయం నీదే

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే’)

నిర్ణయం నీదే

రచన: చింతా రాంబాబు

నీవు చేసే ప్రతీ పనికి
నీ అంతరంగానికి
నీవే సమాధానం చెప్పుకోవాలి
వెతుకులాట లేకుండా…
స్నేహం పేరుతో నమ్మించి మోసం చేసే
సమయంలో
నీకు జన్మనిచ్చి, పెద్ద చేసిన తల్లిదండ్రులను అనాధాశ్రమం లో వదిలి వచ్చేటప్పుడు..
నీ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వలన
అమాయకపు ప్రాణాన్ని బలి తీసినప్పుడు..
పసిమొగ్గలను నీ మృగ వాంఛలకు బలిచేసినప్పుడు..
నీ అంతరంగం నిన్ను ప్రశ్నిస్తే
నీవు చెప్పే సమాధానం
ఏమిటి??
ఆ ప్రశ్నలను తోసిబుచ్చుతావా…
లేక సమాధానం చెబుతూ…
నీ ప్రవర్తనను మార్చుకుంటావా!
మనిషిగా మారతావా…!!
మృగం లా చెలామణి అవుతావో…
నిర్ణయం నీదే…!!

************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!