అంశం: చీకటి వెలుగులు
వెలుగుల రంగేళి
రచన: దొడ్డపనేని శ్రీ విద్య
చీకటి వెలుగుల రంగేళి
అందరి ఇంట అనురాగాల రవళి
ప్రతి రోజు ఆనంద సరాగాల కేళి
మంచిని పెంచే సాహిత్య శోభావళి
దీప కాంతుల విజయ సంబరం
విజ్ఞాన వెలుగుల దివ్వె అంబరం
ఉత్సాహమే హద్దుగా నవ్వులు పూయిద్దాం
అవని అంతా దీపాల తేజోత్సవం
అంతరంగం లో అంధకార అంతం
మనసులు మురిసే ఆనంద విజయోత్సాహం
సిరి సంపదలతో వర్ధిల్లు శోభాయమానం
ప్రకృతి పరరక్షణ దిశగా అడుగుల వేద్దాం
ఎకో గ్రీన్ కాకర్స నే వెలిగిద్దాం
అజ్ఞాన తిమిర చీకట్లను తరిమేద్దాం
జ్ఞాన జ్యోతి ప్రకాశాలను కనుగొందాం
నుదుటి రాతలను మార్చి చూపిద్దాం
మార్పులను గెలుచు కుంటూ పయనిద్దాం
లక్ష్మిమాత అనుగ్రహం కోసం ప్రార్థిద్దాం
కొంగొత్త జీవనానికి స్వాగతం పలుకుదాం