(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”)
కల్లోలసాగరం
రచన: మక్కువ. అరుణకుమారి
ఆశల పల్లకిలో ఊరేగుతూ
ఆనంద తీరాలు చేరాల్సిన తరుణంలో
అంతుపట్టని నైరాశ్యం అలుముకుందెందుకని
అంతరంగం ప్రశ్నిస్తే???
దశాబ్దాల స్వప్నాలు సుదూర తీరాలు దాటుకుని
సత్యమై దరిచేరే వేళ
స్వప్నమై మరలిపొమ్మంటుందెందుకని
అంతరంగం ప్రశ్నిస్తే???
అప్యాయతానురాగాలతో ఆల్లుకోవాల్సిన ఆందమైన బంధాలు
అకారణ కోప ,తాపాలతో ప్రజ్వరిల్లేదెందుకని
అంతరంగం ప్రశ్నిస్తే???
వేదనలో వేకువలు పంచుకున్నది
వేకువలో వేదనలు పంచేందుకా అని అంతరంగం ప్రశ్నిస్తే???
అంతరంగ ప్రశ్నలకు జవాబు చెప్పేదుందా?
ఉంటే అవి
కల్లోలసాగరాలా???
కన్నీటి సుడిగుండాలా???
***********************