నీకోసం నేను
రచన: క్రాంతి కుమార్(ఇత్నార్క్)
కనులకు నీ రూపం
కనిపించకున్నా
నా మది నిండా
నీ చిత్రాన్నే నింపుకున్నా
తేనెలొలుకు నీ పలుకుల
సరిగమలు వినిపించకున్నా
నీ మనసు పాడే
మౌనరాగన్ని నే వింటున్నా
నా ప్రేమ కవిత్వాన్ని చదివే
నీ అధరాలు లేకున్నా
నీ మది భావాలను
నా హృదయం చెబుతోంది
నా కలలకు తోడుగా
నువ్వొస్తానంటే
చీకటిలో కూడా నీడై
నీ శ్వాసలో నేనుంటా….