జంట తీగలు..
చైత్రశ్రీ (యర్రాబత్తిన మునీంద్ర)
రసాత్మకతా ముసుగు కప్పుకొని
రంజింపలేని మనసు తోడై అడుగులేస్తున్నా
ఒంటరితనం వీడిపోదు…
హత్తుకున్న ప్రతి హృదయం ప్రేమ స్వరూపమై పోదు
నటన నిండిన గుండెకే
ఆకర్షించే శక్తెక్కువ కదా…
నాలుక చివర తేనెలొలుకే ప్రేమ
తీపిని చల్లుతూ
జాలిని కురిపించే కళ్ళు మాత్రం నీడలా వెన్నంటే నడుస్తున్నా
ఏం లాభం…
జత కలిసిన జంట తీగల దారులు వేరు…
శరీరాలు ఒక్కటే..!