ప్రియసఖి

ప్రియసఖి

సుశీల రమేష్

నిరాశలకు నెలవైన నాగుండె గూటికి
చేరింది పున్నమి జాబిలి,
ఆనాటినుండి నైరాశ్యం నన్ను వీడి
పోయింది, తన ఓరకంటి చూపులలో ,చిక్కుకున్న నా హృదయం, తిరిగి నా వైపు రానన్నది. వెన్నెల కన్నా చల్లనైన
తన ఒడిలో పవళించిన
నా తనువుకు ఎంతో స్వాంతన.
నాలో నేను లేను
తన ఊపిరినయ్యాను.
ఆనాటి నుండి నేటి వరకు
తన అల్లరితో నా పంతానికి
మైత్రిని పంచిన ప్రేమ దేవత
నా కష్టసుఖాలలో తోడునీడగా
నిలిచి, నా చేతిలో చేయి వేసి
నాతో ఏడడుగులు నడిచిన
నా మది మెచ్చిన మోహనాంగి
ఆమె నా ప్రియ సఖి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!