ఉండ్రాజవరం..వలస కూలి!

ఉండ్రాజవరం..వలస కూలి!

రచన: తొర్లపాటి రాజు

ఉన్న ఊరిలో ఉపాధి లేక!
బడ్డీ కొట్టుకి పెట్టుబడి లేక!
ఏ పనిలోనూ ప్రావీణ్యం లేక!
భార్యా పిల్లల్ని పోషించక తప్పక!

బయల్దేరాం భాగ్యనగరానికి!
కుదురుకున్నా భవంతులు పనికి!
నా పిల్లలు అక్కడే సర్కారోడి బడికి!
చిన్న రేకులు షెడ్డేమో మా బస కి!

మా రక్తాన్ని చెమటగా మార్చి!
రూపాయికి రూపాయి చేర్చి!
రేషన్ కి పిల్లల్ని లైన్ లో వుంచి!
ఉన్న దాంట్లో బతుకుని ఈడ్చి!

జీవితం సాగిస్తున్న మాకు…
కరోనా లాక్ డౌన్ తో….
మా కడుపుకు లాక్ పడింది!

పని లేదు… పైకం లేదు..
బస లేదు..బువ్వ లేదు…

ఆకలి మహమ్మారి …
కడుపులో పేగుల్ని… తొలిచేస్తుంటే!
అంగలేసే పాదాలు పగిలి..
అడుగేసెందుకు ససేమిరా అంటుంటే..
నెత్తిన మూట..భుజాన బరువు..
చంకన చంటోడ్ని వేసుకొని..
సొంత గూటికి నడుస్తుంటే!
పోలీస్ అన్నల లాఠీ…
నా వీపు మీద విరుగుతుంటే!
నా బుడ్డోడు భయం తో…చంక దిగి..
పరిగెడుతుంటే!

పెద్ద శబ్ధం!

ఇంకేముంది!
నా బుడ్డోడ్ని గుద్దింది…
ఓ పోరడి…బండి!

మా బాధ…
ఏమి చెప్పాలండీ..
ఎవరికి చెప్పాలండీ?
మా అరుపులు ఆలకించేదేవరు?
మా మనసును పలకరించేదెవరు?

హే భగవాన్!
నిన్ను ఏమని ప్రార్థించవలెన్
కరోనా నుండి కాపడమనా
లేక కడుపు మంట నుండి కాపడమనా!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!